ప్రెగ్నెన్సీ కోసం అలాంటి కష్టాలు... ఆ 10 ఏళ్లు నరకంలా... తీన్మార్ సావిత్రి
ఓ సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నారు జ్యోతక్క అలియాస్ తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి. ఓ ప్రముఖ తెలుగు వార్తాసంస్థలో ప్రసారమైన తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్‌లో సావిత్రిగా ఆమె పాపులర్ అయ్యారు. అనంతరం బిగ్‌బాస్ షోలో శివజ్యోతికి అవకాశం రావడంతో ఆమె జీవితాన్ని మరింత మలుపు తిప్పింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక జ్యోతక్కకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ వచ్చింది. దాంతో న్యూస్ రీడింగ్, యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి ప్రైవేట్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.
చిన్న వయసులోనే ఆమె గంగూలి అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఈ దంపతులు హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వీరిద్దరూ జీవితంలో ఆర్ధిక స్థిరత్వంతో పాటు సెలబ్రిటీ హోదా సాధించారు. ఉండటానికి ఇల్లు, కారు జీవితంలో అన్ని సంపాదించినప్పటికీ ఈ దంపతులకు ఒకే ఒక్క లోటుంది. అదే పిల్లలు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శివజ్యోతి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏడు శనివారాల వ్రతం, తిరుమల శ్రీవారి ఆశీస్సులతో శివజ్యోతి ఇటీవల గర్భం దాల్చారు. అయితే తిరుమలకు వెళ్లిన తర్వాత శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు.

పదేళ్ల నిరీక్షణ తర్వాత గర్భం దాల్చడంతో శివజ్యోతి, ఆమె కుటుంబ సభ్యులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు శ్రీమంతం జరుపుకోవడంతో పాటు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను శివజ్యోతి వీడియోల రూపంలో పంచుకుంటున్నారు. తాజాగా పదేళ్ల కాలం తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే... మాకు పెళ్లయి పదేళ్లు అయ్యింది, కానీ పదేళ్ల నుంచి పిల్లల్ని కావాలని మేం కోరుకోలేదు. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర వీడియోలలో అడ్డమైనోళ్లు.. అడ్డమైన విధంగా కామెంట్స్ పెడుతున్నారు. 2015లో మాకు పెళ్లయ్యింది.. కానీ మేం గడిచిన రెండున్నరేళ్ల నుంచే పిల్లలు కావాలని కోరుకుంటున్నాం. ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలు ఎప్పుడు? పెళ్లి కాకపోతే పెళ్లి ఎప్పుడు? జాబ్ లేకపోతే జాబ్ ఎప్పుడు? అని ఎవరినీ అడగొద్దు అని శివజ్యోతి సూచించారు.
మేం పిల్లల్ని కావాలని అనుకునేవరకు ఎవరైనా వచ్చే అడిగితే నాకు కావాల్సినప్పుడు కంటా? నాకు దేవుడు ఇస్తాడు అని కాన్ఫిడెంట్‌గా చెప్పేదానిని. ఎప్పుడైతే నేను కావాలని అనుకున్నానో ఎవరైనా వచ్చి అడిగితే గలీజుగా ఫీలయ్యే దానిని. కనిపించే స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనొద్దని పెళ్లయినప్పుడే నిర్ణయించుకున్నాం. బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చిన తర్వాత లాక్‌డౌన్ వచ్చింది. మా ఇద్దరికీ కరోనా వచ్చింది.. చాలామంది డెలివరీలు చేయడానికే భయపడ్డారు. అలాంటి పరిస్ధితుల్లో పిల్లల్ని ప్లాన్ చేయలేం. మనకంటూ ఇల్లు ఉండాలని రూపాయి రూపాయి దాచుకుని ఇల్లు కట్టుకున్నాం. డెలివరీ టైంలో నేను, బిడ్డ ఇబ్బంది పడొద్దని .. వైద్య ఖర్చుల కోసం 2015 నుంచి ఇన్సూరెన్స్ కట్టి ప్లాన్డ్‌గా ఉన్నామని శివజ్యోతి తెలిపారు.
ఐయూఐ, ఐవీఎఫ్ చేయించుకున్నానని చాలా మంది అడిగారు. కానీ మేం సంప్రదించిన డాక్టర్స్ అంతా కూడా నీకు, మీ ఆయనకు అంతా బాగానే ఉంది కాబట్టి నేచురల్‌గానే ప్రయత్నించమని చెప్పారు. ఈ చివరి రెండున్నర సంవత్సరాలలో మొక్కనీ దేవుడు లేడు.. తెలిసిన డాక్టర్స్ అందరినీ అడిగాం, చెట్ల మందులు తిన్నా అన్నీ ట్రై చేశా. ఒకవేళ నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రాకపోయినా నాకు భగవంతుడు ఐయూఐ, ఐవీఎఫ్ రూపంలో ఇచ్చినా యాక్సెప్ట్ చేసేదానిని. ఎవరికైనా ఫోబియో ఉంటే నేను కూడా సూచించేదానిని. వెంకటేశ్వర స్వామి వ్రతం స్టార్ట్ చేశాక గర్భం దాల్చాను. ఈ ప్రాసెస్‌లో నా కుటుంబం, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. కొన్ని హాస్పిటల్స్ వాళ్లు నన్ను గుచ్చి గుచ్చి కామెంట్స్ చేశారు. రిపోర్ట్స్ పెట్టడం లేదని కొంతమంది అడుగుతున్నారు. కానీ అవి డాక్టర్ దగ్గర ఉన్నాయి. పిల్లలు కావాలనుకునే ఆడవాళ్లకి అత్తామామలు, తల్లిదండ్రుల సపోర్ట్ కంటే భర్త సపోర్ట్ చాలా అవసరం అని శివజ్యోతి అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications










