ఆ రోజు వరకు నేను, నా భర్త బతికుండాలి... యాంకర్ శివజ్యోతి కంటతడి

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా మారిపోయింది తీన్‌మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి. ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రసారమైన తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్‌లో సావిత్రిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ యాస, పంచ్‌లు, కట్టుబొట్టుకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ ఫేమ్ కారణంగా శివజ్యోతికి బిగ్‌బాస్ తెలుగు 3లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. బిగ్‌బాస్‌తో పాపులారిటీ తెచ్చుకున్న శివజ్యోతి.. ఆ తర్వాత షార్ట్ ఫిలింస్, ప్రైవేట్ ఆల్బమ్స్, పలు ఛానెల్స్‌లో వివిధ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయ్యింది.

Also Read
కట్ చెప్పినా హీరోతో శృంగారంలోనే జాక్వలైన్.. లైట్స్ ఆఫ్ చేసి ముద్దుల వర్షం
కట్ చెప్పినా హీరోతో శృంగారంలోనే జాక్వలైన్.. లైట్స్ ఆఫ్ చేసి ముద్దుల వర్షం

గంగూలి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శివజ్యోతి. అయితే ఈ పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఈ దంపతులు హైదరాబాద్ వచ్చేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వీరిద్దరూ ఈ స్థాయికి చేరుకున్నారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో శివజ్యోతి పలుమార్లు వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యేవారు. అయితే ఆమె నోములు ఫలించి ఇటీవలే శివజ్యోతి గర్భం దాల్చారు. దాంతో వీరి కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. తిరుమల వెంకన్న ఆశీస్సులతోనే తాను గర్బం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ఆమె పంచుకున్నారు.

Bigg Boss Fame Shiva Jyothi Turns Emotional Praying for Daughter Vennela in Sridevi Drama Company

గర్భధారణ నుంచి డెలివరీ వరకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్చే చేస్తూ వచ్చారు శివజ్యోతి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 12న సావిత్రి.. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో శివజ్యోతి- గంగూలీ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకున్నారు. ఈ చిన్నారికి వెన్నెల అని పేరు పెట్టి పాపని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వెన్నెల రాకతో తమ జీవితాల్లోకి వెన్నెల వచ్చిందని వీరిద్దరూ మురిసిపోతున్నారు. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నారు శివజ్యోతి. అలాగే కొన్ని సినిమాలలో ఆఫర్లు కూడా వస్తున్నాయి. దానితో పాటు తెలుగు బుల్లితెరపై పలు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో శివజ్యోతి పాల్గొంటున్నారు.

Recommended For You
ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి
ఐదుగురితో కమిట్‌మెంట్.. అలా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తాయి

తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన భర్త గంగూలీ, కుమార్తె వెన్నెలతో కలిసి పాల్గొన్నారు సావిత్రి. త్వరలో ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా సిద్థమైంది శ్రీదేవి డ్రామా కంపెనీ. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. దీనిలో భాగంగా అమ్మవారి సెట్‌ను ఏర్పాటు చేసి.. ఆమె ముందు రోలు, రోకలి ఏర్పాటు చేసి 2 నిమిషాల పాటు ఈ రోకలి ఆ రోలులో నిలబడితే మీ కోరిక నెరవేరుతుందని చెబుతుంది యాంకర్ రష్మి. తొలుత పొట్టి నరేష్.. తన ప్రేమను రష్మి అంగీకరించాలని చెబుతూ మొక్కుకుని రోకలి నిలబెడతాడు.

You May Also Like
డెలివరీ బాయ్‌పై టాలీవుడ్ హీరో దాడి.. ముఖంపై ఉమ్మేసి దారుణంగా..
డెలివరీ బాయ్‌పై టాలీవుడ్ హీరో దాడి.. ముఖంపై ఉమ్మేసి దారుణంగా..

ఆ తర్వాత జోర్దార్ సుజాత వచ్చి నా బిడ్డ చల్లగా ఉంటే చాలని మొక్కుకుని రోలు నిలబెడుతుంది. ఆ వెంటనే శివజ్యోతి వచ్చి.. రోజూ దేవుడిని మొక్కుకునేది ఒకటే నాలాగే వెన్నెలకి కూడా మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చే వరకు మేమిద్దరం ఉండాలి, మా ఇద్దరికీ ఏం కాకూడదని చెబుతూ కంటతడి పెట్టడంతో గంగూలీ వచ్చి ఓదార్చడంతో అంతా ఎమోషనల్ అవుతారు. గంగూలీ, శివజ్యోతి కలిసి తమ బిడ్డ గురించి కోరిక కోరుకుని అమ్మవారి ముందు రోలులో రోకలి నిలబెట్టారు. అయితే అది నిలబడిందా? లేదా? అన్నది మాత్రం ప్రోమోలో చూపించలేదు. ఇక చివరిలో కడుపులో బిడ్డ ప్రయాణం, అబార్షన్స్ గురించి తెలియజేస్తూ చేసిన స్కిట్ కూడా అందరినీ ఏడిపించింది.

14 ఏళ్లు ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరిని పెళ్లాడింది... షాకింగ్‌గా సుడిగాలి సుధీర్ బ్రేకప్‌ స్టోరీ
14 ఏళ్లు ప్రాణంగా ప్రేమిస్తే.. మరొకరిని పెళ్లాడింది... షాకింగ్‌గా సుడిగాలి సుధీర్ బ్రేకప్‌ స్టోరీ

ఈ సందర్బంగా శివజ్యోతి మాట్లాడుతూ.. పెళ్లయిన అందరికీ పిల్లలు ఉండాలని రూల్ లేదు, కావాలంటే ఎవరినైనా తెచ్చి పెంచుకుందామని నా భర్త చెప్పాడు. తల్లిని కావాలని కోరుకునేవారికి చెబుతున్నా.. నాలాగే మీ అందరికీ కూడా ఖచ్చితంగా టైమ్ వస్తుందని చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. శివజ్యోతి చెప్పిన మరిన్ని విషయాల గురించి తెలియాలంటే ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X