కార్తీక దీపం శోభాశెట్టిని గోవాకి తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లోనే .. పెళ్లి చేసుకోమంటే..

తెలుగుతో పాటు ఇండియాలోనే టాప్ టీవీ సీరియ్‌గా వెలుగొందిన కార్తీక దీపంలో డాక్టర్ మోనితగా ప్రేక్షకుల చేత తిట్లు, చీవాట్లు తిన్నారు శోభా శెట్టి. ఈ సీరియల్ ఇంతటి సక్సెస్ కావడం వెనుక మోనితగా శోభాశెట్టి నటన కూడా కీ రోల్ పోషించింది. మాతృభాష కన్నడం కంటే తెలుగులోనే ఆమె ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా తెలుగులో సీరియల్స్, ఇతర ఈవెంట్స్ తగ్గించేసిన శోభాశెట్టి తాజాగా జబర్దస్త్ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్స్ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

పునీత్ రాజ్‌కుమార్‌తో నటించిన శోభ
ఏకకాలంలో కన్నడ టెలివిజన్, సినీ రంగాల్లో ఎంట్రీ ఇచ్చారు శోభాశెట్టి. 2017లో దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్- రష్మిక మందన్న నటించిన అంజనీ పుత్ర చిత్రంలో నటించారు శోభాశెట్టి. ఇదే సమయంలో ఆమె నటించిన కావేరి అనే సీరియల్ కూడా శోభకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో తెలుగులోనూ ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టింది. తెలుగులో అష్టాచమ్మా, లాహిరి లాహిరి లాహిరిలో, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం తదితర ధారావాహికల్లో నటించారు. కానీ ఆమెకు పేరు తీసుకొచ్చింది మాత్రం కార్తీక దీపం సీరియలే.

Bigg Boss Fame Shobha Shetty gets emotional in a podcast hosted by Jabardasth Varsha

మోనితగా క్రూరత్వం
వంటలక్కని సైడ్ చేసి డాక్టర్ బాబును సొంతం చేసుకునేందుకు మోనితగా ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. శోభను తప్పించి ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేరంటే ఆమె టాలెంట్‌ను అర్ధం చేసుకోవచ్చు. కార్తీక దీపం సీరియల్‌కి శుభం కార్డ్ పడటంతో శోభాశెట్టి తర్వాత మరే తెలుగు సీరియల్‌లోనూ కనిపించలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 7లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది శోభ. అక్కడ విపరీతమై నెగిటివిటీతో ఇంటి ముఖం పట్టింది. ఈ క్రమంలో గతేడాది కన్నడ బిగ్‌బాస్‌లోనూ శోభాశెట్టి కంటెస్టెంట్‌గా అవకాశాం దక్కించుకున్నారు. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకి తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో శోభ రిలేషన్‌లో ఉన్నారు. వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. పెళ్లి కోసం ఈ జంట వెయిట్ చేస్తోంది. తాజాగా వర్ష పాడ్‌కాస్ట్‌లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శోభాశెట్టి.

ఎయిర్‌పోర్ట్‌ల్లోనే పడుకున్నా
తాను ఫోటోలు తీసుకుని ఆడిషన్స్‌కు వెళ్లేదాన్నని.. స్టూడియోల చుట్టూ తిరిగేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని ఆమె వాపోయింది. అమ్మ మంగళసూత్రం తాకట్టు పెట్టి బెంగళూరులో ఓ అద్దె ఇంట్లో దిగామని, ఎన్నోసార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే పడుకున్నామని శోభ గుర్తుచేసుకున్నారు. బెంగళూరులో ఎలాగైనా సొంతిల్లు కొనుక్కోవాలని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ వచ్చానని చెప్పింది. కన్నడ బిగ్‌బాస్‌లో జరిగిన గొడవపైనా శోభాశెట్టి క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రోమో చూస్తే అర్ధమవుతోంది.

స్విమ్మింగ్‌పూల్‌లో అరాచకం
అయితే కొద్దిరోజుల క్రితం వైట్ శారీ కట్టుకుని వర్షంలో నడుము చూపిస్తూ శోభాశెట్టి చేసిన ఫోటోషూట్ వైరల్ అయ్యింది. దీనిపై వర్ష ప్రశ్నించింది. మీరు ఆ చీరలో ఆ నడుము చూపిస్తే మా కుర్రాళ్లంతా ఏమైపోవాలని వర్ష ప్రశ్నించింది. అనుకోకుండా, నేను యశ్వంత్ గోవాకి వెళ్లామని ఆ సమయంలో వర్షం కురవడంతో వాడే స్విమ్మింగ్‌పూల్‌లో వీడియో, ఫోటో షూట్ చేశాడని శోభ తెలిపింది. 2025లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరం అనుకున్నామని.. బాబుగారు అంత ఈజీగా నా లవ్‌ని యాక్సెప్ట్ చేయలేదని బయటపెట్టింది. కానీ యశ్వంత్ లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేనని ఆమె ఎమోషనల్ అయ్యింది. మరి కన్నడ బిగ్‌బాస్‌లో ఏం జరిగింది? శోభాశెట్టి- యశ్వంత్‌ల పెళ్లి ఎప్పుడు? ఈ వివరాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X