ఇన్నాళ్లూ ఎక్కడ దాచిందో.. వర్షంలో తడి అందాలతో శోభాశెట్టి అరాచకం!

స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగువారిని పలకరించిన శోభాశెట్టి నాటి నుంచి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. త్వరలోనే తెలుగింటి కోడలు కూడా కానున్నారు. ప్రియుడు యశ్వంత్‌తో ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభాశెట్టి అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మోనితగా క్రూరత్వం

కర్ణాటకకు చెందిన శోభాశెట్టి తెలుగు టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్‌లో నటించారు. అయితే కార్తీక దీపం మాత్రం ఆమె కెరీర్‌నున మలుపు తిప్పింది. ఈ సీరియల్‌లో డాక్టర్ మోనితగా క్రూరత్వం చూపించారు. వంటలక్కని సైడ్ చేసి డాక్టర్ బాబును సొంతం చేసుకునేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, కుట్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సీరియల్ నడిచినంత కాలం శోభాశెట్టిని తిట్టని వారు, శాపనార్ధాలు పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆమె తన ముద్ర వేశారు. శోభను తప్పించి ఆ క్యారెక్టర్‌లో మరొకరిని ఊహించుకోలేరంటే ఆమె ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు. కార్తీక దీపం సీరియల్ అంత పెద్ద హిట్ కావడానికి నిరూపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్‌లతో సమానమైన పాత్ర పోషించింది శోభాశెట్టి.

Bigg Boss Fame Shobha Shetty Play with Rain in transparent saree Her Latest Photos here

బిగ్‌బాస్‌తో మరింత పాపులర్

కొన్నేళ్ల పాటు తెలుగుతో పాటు భారతీయ బుల్లితెర రంగంలో టాప్‌లో కొనసాగిన కార్తీక దీపం సీరియల్‌కి శుభం కార్డ్ పడటంతో శోభాశెట్టి తర్వాత మరే తెలుగు సీరియల్‌లోనూ కనిపించలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది శోభ. అక్కడ కొద్దిరోజులు తన మార్క్ చూపించడానికి ప్రయత్నించినా.. ప్రేక్షకులు ఇంటికి పంపడంతో ఎలిమినేట్ అయ్యింది శోభాశెట్టి. అలాగే గతేడాది కన్నడ బిగ్‌బాస్‌లోనూ శోభాశెట్టి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. తద్వారా తెలుగు, కన్నడ బిగ్‌బాస్‌లలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన అరుదైన ఘనతను దక్కించుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడంతో సొంత రాష్ట్ర ప్రజలు కూడా శోభను ఎలిమినేట్ చేసేశారు. అయితే చివరి వరకు బిగ్‌బాస్‌లో ఉండాలన్న తన తల్లి కోరికను తీర్చలేకపోయానని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్ బాబు తమ్ముడితో ప్రేమాయణం

కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకి తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సన్నిహితుల మధ్యలో ఈ జంట నిశ్చితార్ధం చేసుకుంది. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి ఏడాదిపైనే కావొస్తున్నా నేటికీ వీరిద్దరూ ప్రేమ పక్షుల్లాగా తిరుగుతున్నారు తప్పించి భార్యాభర్తలు కాలేదు. ఇటీవల నిశ్చితార్ధానికి ఏడాది అంటూ ఫోటోలను షేర్ చేశారు శోభాశెట్టి. దాంతో పెళ్లెప్పుడు మేడం? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Take a Poll

వర్షంలో తాపం పెంచేస్తోన్న శోభాశెట్టి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే శోభా శెట్టి తన షోలు, ఇతర కార్యక్రమాల గురించి నిత్యం అభిమానులతో పంచుకుంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్, వీడియోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. తాజాగా ఉల్లిపొర లాంటి చీరలో వర్షంలో తడుస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో మునుగుతూ శోభ అందాల జాతర చేశారు. నడుము, నాభి అందాలను ఆరబోస్తూ తాపం పెంచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శోభాశెట్టి ఈ అందాలను ఇన్నాళ్లు ఎక్కడ దాచేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి శోభ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X