యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? దిమ్మతిరిగేలా కార్తీక దీపం విలన్ రిప్లయ్

స్టార్ మాలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కన్నడ నటి శోభా శెట్టి. ఈ సీరియల్‌లో విలన్‌గా తన అద్భుత నటను ప్రదర్శించారు. డాక్టర్ మోనిత అనే రోల్‌లో తను కోరకున్న డాక్టర్ బాబును దక్కించుకునేందుకు వేసిన ఎత్తులు, వంటలక్కని ఏడిపించిన తీరుకు మహిళా ప్రేక్షకులు శోభా శెట్టిని తిట్టుకున్నారు. దీనిని బట్టి ఆమె నటనను అర్ధం చేసుకోవచ్చు. కన్నడ అమ్మాయే అయినా తెలుగులో వరుస సీరియల్స్‌లో అలరించారు. అయితే గత కొంతకాలంగా బుల్లితెరపై ఆమె అంతగా కనిపించకపోవడంతో శోభా శెట్టి తన నట జీవితానికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా శోభా శెట్టి క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన శోభా శెట్టి.. చదువు పూర్తి చేశాక కన్నడ బుల్లితెరపై అడుగుపెట్టారు. అప్పటి వరకు పేదరికంలో ఇబ్బందులు పడిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆమె సీరియస్‌గా వేషాల కోసం ప్రయత్నించారు. ఈ దశలో అగ్నిసాక్షి అనే కన్నడ సీరియల్‌లో తను అను అనే పాత్ర పోషించారు. ఈ దశలో సినీరంగం నుంచి ఆమెకు పిలుపొచ్చింది. దివంగత పునీత్ రాజ్ కుమార్, రష్మిక మందన్న జంటగా నటించిన అంజనీ పుత్రలో శోభా శెట్టి కీలకపాత్ర పోషించారు. అనంతరం కావేరి సీరియల్‌లో నటించారు.

Bigg Boss Fame Shobha Shetty Reacts to Rumors About Quitting Acting Career

ఈ దశలో తెలుగు బుల్లితెర రంగం నుంచి శోభాశెట్టికి అవకాశాలు వచ్చాయి. తొలుత స్టార్ మాలో అష్టాచెమ్మా సీరియల్‌లో నటించింది. అనంతరం కార్తీక దీపంలో డాక్టర్ మోనిత రోల్ ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సీరియల్‌లో నటనకు గాన్నో బెస్ట్ విలన్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. కార్తీక దీపంతో పాటు లాహిరి లాహిరి లాహిరిలో, అత్తారింటికి దారేది, హిట్లర్ గారి పెళ్లాం తదితర సీరియల్స్‌లో నటించారు శోభా శెట్టి.

ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 7లో అవకాశం దక్కించుకున్న శోభా శెట్టి అక్కడా ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కన్నడ బిగ్‌బాస్‌లోనూ అవకాశం దక్కించుకుని.. రెండు భాషలలో బిగ్‌బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో ప్రేమలో పడిన శోభ.. అతనితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. అయితే నిశ్చితార్ధం జరిగి రెండేళ్లకు పైగానే గడుస్తున్నప్పటికీ వీరిద్దరూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.

అయితే సీరియల్స్‌కు శోభా శెట్టి పూర్తిగా దూరమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వీడియోలు, వ్లాగ్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శోభా శెట్టి నట జీవితానికి గుడ్ బై చెప్పేశారంటూ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో శోభా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేశారు.

దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మీరు ఫేస్ చేసిన రూమర్స్ ఇవేనంటూ కంటెస్టెంట్స్‌గా వచ్చిన మహిళా నటుల్ని యాంకర్ శ్రీముఖి స్క్రీన్‌పై ప్రదర్శించింది. ఈ క్రమంలో శోభా శెట్టి వంతు రాగా.. యాక్టింగ్‌కి బై బై చెప్పిన శోభా అనే రూమర్‌ ఎక్కువగా వస్తున్నట్లు శ్రీముఖి తెలిపింది. దీనికి శోభా శెట్టి స్పందిస్తూ.. దండం పెట్టేసింది. అలాంటివి ఏం లేవని ఒక్క ముక్కలో రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా... తమ అభిమాన శోభా శెట్టి బుల్లితెరపైనే కొనసాగుతున్నారని తెలిసి ఆమె అభిమానులు సంతోషిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X