Siri Hanumanth: అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన బిగ్ బాస్ సిరి.. ఇలా ఏమాత్రం చూసిండరు!
బుల్లితెరపై విశేషమైన ఆదరణ పొందింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. అలాంటి వారిలో గ్లామరస్ బ్యూటి సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో సుధీర్ఘకాలంగా హడావిడి చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో ద్వారా తెగ పాపులర్ అయిపోయింది.
ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఘాటైన తన సొగసు ఫొటోలు పెడుతూ హీట్ పెంచుతోంది.

బుల్లితెర రంగం: అందాల ముద్దుగుమ్మ సిరి హన్మంత్ మొదట్లో ఒక రిపోర్టర్‌గా యూట్యూబ్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసి తన మాటలతో ఆకట్టుకుంది. అలా పాపులర్ అయిన బ్యూటిఫుల్ సిరి హన్మంత్ అనంతరం బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది.

వెబ్ సిరీసులు: సీరియళ్లలో మంచి నటనతో, చక్కనైన నవ్వుతో ఆకట్టుకున్న గ్లామరస్ చిన్నది సిరి హన్మంత్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెర రంగంలో నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి సత్తా చాటింది. అంతేకాకుండా 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది.
2021 సంవత్సరం: సీరియళ్లు, వెబ్ సిరీస్, సినిమాలతోపాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్, స్పెషల్ వీడియోలు చేసిన సిరి హన్మంత్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. అలా 2021లో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది.

ఆటతీరుతో: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన అతికొద్దిమందిలో ఎంతో అందమైన సిరి హన్మంత్ కూడా ఉంది. ప్రారంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటి తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది. ఇందులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా పార్టిస్ పేట్ చేసిన విషయం తెలిసిందే.

బీభత్సంగా నెగెటివిటీ: సిరి హన్మంత్ ఆటతీరుతో పర్వాలేదనిపించినా ప్రవర్తన శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూ హైలెట్ అయ్యేది. అయితే ఆమె ముఖ్యంగా షన్నూతో ఫ్రెండ్షిప్ అని చెప్పి.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ ఉండేది. దీంతో ఆమెపై బీభత్సంగా నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. అలా సిరి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది.

టెంపరేచర్ పెంచేలా: బిగ్ బాస్ తర్వాత పులి మేక వెబ్ సిరీసుతో అలరించింది సిరి హన్మంత్. అలా పలు సినిమాలు, సిరీసులు చేస్తున్న ఈ బ్యూటి సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ కొత్త కొత్త ఫొటోలతో కవ్విస్తుంటుంది. అలా తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్న సిరి ఘాటుగా పోజులు ఇవ్వడమే కాకుండా అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదివరకు ఏమాత్రం చూడని విధంగా అందాలతో టెంపరేచర్ పెంచేసింది ఈ బ్యూటి.


Click it and Unblock the Notifications











