Bigg boss లో తెలియకుండా తప్పు జరిగిపోయిందన్న సిరి.. కన్నీళ్ళతో దగ్గరికి తీసుకున్న శ్రీహన్
బిగ్ బాస్ ద్వారా చాలామంది చిన్న స్థాయి సెలబ్రిటీలకు మంచి గుర్తింపు అయితే లభించింది. అయితే ఆ వచ్చిన క్రేజ్ తో కొంతమంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా మారుతుంటే.. మరి కొందరు మాత్రం టెలివిజన్ ప్రపంచం లో రియాలిటీ షోలు చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు కొన్ని టెలివిజన్ ఛానెల్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో వారికి మరింత క్రేజ్ వచ్చేలా చేస్తున్నాయి. ఇంకా రీసెంట్ గా ఒక రియాలిటీ షోలో పాల్గొన్న సిరి హనుమంతు గతంలో జరిగిన పొరపాటు గురించి తలుచుకుని ఏడ్చేసింది. ఇక ఆమె ఏడుస్తున్న ప్రోమో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో అలా క్రేజ్ అందుకుంటూ..
సిరి హనుమంతు మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్ లో ఆమె షణ్ముఖ్ జష్వంత్ కూడా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేసింది. అంతేకాకుండా ఆమె సోలోగా కూడా చేసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక అటు నుంచి బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకొని మరింత గుర్తింపును అందుకుంది.

బిగ్ బాస్ లో ప్రేమాయణం?
బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సిరి హనుమంతు తప్పకుండా విజయాన్ని సాధించాలని గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె అనుకున్నట్లు విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఆ షోలో ఉన్నన్ని రోజులు కూడా ఆమెకు అలాగే మరొక కంటెంట్ షణ్మఖ్ జస్వంత్ మద్యలో ప్రేమాయణం కొనసాగుతోంది అని అందుకే సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ఆమెను వదిలేసాడు అని కూడా కథనాలు వచ్చాయి.

గెలిచిన శ్రీహన్
ఇంకా అలాంటి రూమర్స్ అన్ని వచ్చినా కూడా శ్రీహాన్ అయితే వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక అతను కూడా బిగ్ బాస్ 6వ సీజన్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా అతనిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా వాటిని సిరి హనుమంతు పట్టించుకోలేదు. అంతేకాకుండా తను గెలవాలని కోరుకుంది. ఇక ఓట్ల ప్రకారం అయితే శ్రీహన్ బిగ్ బాస్ లో గెలిచి నిరూపించుకున్నాడు.

షోలో శ్రీహన్ కు ప్రపోజ్
ఇక సిరి హనుమంతుకు సంబంధించిన ఒక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ మా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో సిరి హనుమంతు శ్రీహన్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఇక శ్రీహన్ కు గోల్డ్ రోజ్ ఇచ్చిన సిరి ప్రపోజ్ చేసింది. ఇక అతను చాలా యూనిక్ అంటూ పొగిడింది.

స్టేజ్ పైన కంటతడి పెట్టుకున్న సిరి
ఇక బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా శ్రీహన్ ను చాలా మిస్ అయ్యాను అని చెప్పిన సిరి అతను గుర్తుకు వచ్చినప్పుడల్లా కూడా ఈ షర్ట్ పై నేను ముద్దులు పెట్టుకున్నాను అని శ్రీహన్ కి దాన్ని కానుకగా ఇచ్చింది. అంతే కాకుండా మరికొన్ని కానుకలను కూడా స్టేజి పైనే ప్రేమతో ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా సిరి స్టేజ్ పైన ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది.

తప్పు జరిగిందన్న సిరి
చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారని కానీ ఆ విషయాన్ని ధైర్యంగా స్టేజ్ పై ఎవరూ ఒప్పుకోరు అని చెప్పిన సిరి.. నేను నిజంగానే నాకు తెలియకుండా ఒక తప్పు చేశాను అని చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంది. ఇక సిరి అలా ఏడుస్తూ ఉంటే శ్రీహన్ ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఇక ఆమెతోపాటు యాంకర్ రష్మీ కూడా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. దీంతో ఆ ప్రోమో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బహుశా బిగ్ బాస్ లో షణ్ముఖ్ జస్వంత్ తో ఆమె అలా ఉండడం గురించి బాధపడి ఉంటుంది.. అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











