Don't Miss!
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Srihan తో రిలేషన్ పై మరో క్లారిటీ ఇచ్చిన సిరి.. పెళ్లి ఎప్పుడంటే?
ఇటీవల కాలంలో సినిమా తారలు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది సెలబ్రిటీలు హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా టెలివిజన్లో అలాగే వెబ్ సిరీస్లలో కూడా కొంతమంది నటీనటులు మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇక ఆ రూట్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ హోదాను సంపాదించుకున్న వారిలో సిరి హనుమంతు శ్రీహన్ ఇద్దరు కూడా ఉన్నారు. ఇక వీరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల సిరి శ్రీహన్ పెళ్లి ఎప్పుడు అనే విషయంపై ఎవరూ ఊహించిన విధంగా ఒక సమాధానం అయితే ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ ద్వారా..
సిరి హనుమంతు మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకుని ఆ తర్వాత ఆమె టెలివిజన్ షోలాల్ లలో కూడా కనిపించింది. ఇక మొత్తానికి బిగ్ బాస్ 5వ సీజన్ ద్వారా కూడా సిరి జనాల్లో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా షన్ముఖ్ తో ఆమె కొనసాగించిన ట్రాక్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అది కేవలం షో కోసం మాత్రమే అని ఒక క్లారిటీ వచ్చేసింది.

ఆ బాబు వలన
సిరి
హనుమంతు
శ్రీహాన్
ఇద్దరు
కూడా
ప్రస్తుతం
ప్రేమలో
ఉన్న
విషయం
తెలిసిందే.
అసలైతే
వీరిని
చూసిన
తర్వాత
చాలామంది
కూడా
పెళ్లి
అయ్యిందేమో
అని
అనుకున్నారు.
ముఖ్యంగా
శ్రీహాన్
బిగ్
బాస్
6వ
సీజన్లో
పాల్గొన్నప్పుడు
సిరి
వచ్చిన
విధానం
అలాగే
వారితోపాటు
ఒక
బాబు
కూడా
రావడంతో
అందరూ
కూడా
వీరు
నిజమైన
తల్లిదండ్రులు
ఏమో
అని
అనుకున్నారు.
కానీ
ఆ
తర్వాత
ఆ
బాబు
సిరి
సోదరుడి
కొడుకు
అని
క్లారిటీ
ఇచ్చింది.

పెళ్లి వార్తలు
ఇక బిగ్ బాస్ తర్వాత కూడా వీరి ప్రయాణం విభిన్నంగా కొనసాగుతోంది. రోజు ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు. అంతేకాకుండా వీరి పెళ్లికూడా త్వరలోనే జరగబోతున్నట్లుగా ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి అంతేకాకుండా మధ్యలో బ్రేకప్ జరిగినట్లు కూడా కొన్ని వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఎలాంటి విభేదాలు లేవని..
మొదట్లో అయితే షణ్ముఖ్ జశ్వంత్ కారణంగానే సిరి నుంచి శ్రీహన్ విడిపోయాడు అని వారి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు వచ్చాయని కూడా బాగానే వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సిరి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చాలా హ్యాపీగా ఉన్నామని కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు.

త్వరలోనే పెళ్లి అంటూ..
ఇక సిరి శ్రీహన్ పెళ్లి ఎప్పుడు అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. ప్రస్తుతం వీరు సినిమాల్లో పెద్దగా అవకాశాలు అయితే అందుకోలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం వెండితెరపై కనిపించాలి అని బిజీగా మారాలి అని అనుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఒక నెటిజన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని ప్రశ్నించగా అందుకు సిరి త్వరలోనే పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. అయితే ఎప్పుడు చేసుకుంటాము అనే విషయంలో కరెక్ట్ గా చెప్పలేదు కానీ తప్పకుండా త్వరలోనే పెళ్లి అయ్యే అవకాశం ఉందని ఆమె ఒక హింట్ అయితే ఇచ్చారు.