స్లీవ్‌లెస్ జాకెట్‌లో బిగ్ బాస్ సిరి ఓవర్ ఎక్స్‌పోజింగ్.. నాభి అందాలతో రచ్చ.. వీడియో వైరల్
మొదట అనేక అనుమానాలతో వచ్చి.. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. మరికొంతమంది ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుని ఫాన్స్ ను సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ముద్దుగుమ్మ సిరి హన్మంత్ ఒకరు. యూట్యూబ్ లో సుధీర్ఘకాలంగా హడావిడి చేసిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా తెగ పాపులర్ అయిపోయింది. బిగ్ బాస్ తర్వాత పలు అవకాశాలతో ముందుకు సాగుతున్న ఈ క్యూట్ బ్యూటి సోషల్ మీడియాలో ఘాటు అందాలను ఓపెన్ గా చూపించేస్తోంది. తాజాగా మరోసారి ఆమె సోకుల విందు చేసింది.
సీరియళ్ల ద్వారా : బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ సిరి హన్మంత్ మొదట్లో ఒక రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో కూడా న్యూస్ రీడర్‌గా చేసింది ఆకట్టుకుంది. అలా ఫేమస్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది.

వెబ్ సిరీసులు : బుల్లితెరపై సీరియళ్లలో చక్కటి నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సిరి హన్మంతు పాపులారిటీలో పర్వాలేదనిపించుకుంది. అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది. అంతేకాకుండా.. 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది.

బిగ్ బాస్ ఛాన్స్ : సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీసులతో పాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలు చేసి క్రేజ్ పెంచుకుంది క్యూట్ బ్యూటి సిరి హన్మంతు. ఈ వెబ్ సిరీస్ లు, స్పెషల్ వీడియాలో యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడంతో ఆమెకు పాపులారిటీ తెగ పెరిగింది. దీంతో రెండేళ్ల క్రితం అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొనే అవకాశం తెచ్చుకుంది.

ఆటతీరుతో : బిగ్ బాస్ ఐదో సీజన్ లో ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా నిలిచి పేరు తెచ్చుకోగా.. అందులో సిరి హన్మంత్ కూడా ఉంది. ఆరంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటీ.. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది. కానీ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో బిహేవియర్ కారణంగా నెగెటివిటీ మూటగట్టుకుంది.

పులి-మేక : అయితే బిగ్ బాస్‌లోకి రాకముందే శ్రీహాన్ చోటు అనే నటుడితో సిరి హన్మంత్ ప్రేమాయణం సాగించింది. అతడితో ఓ కార్యక్రమంలో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అలా ఎంగేజ్‌డ్‌గా బిగ్ బాస్ షోలోకి వచ్చిన ఆమె.. ఈ సీజన్ లో మాత్రం షణ్ముఖ్ జస్వంత్ తో రొమాన్స్‌ను పడించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు పులి మేక వంటి సిరీసులతో నటిగా అవకాశాలు అందుకుంటోంది.
డ్యాన్స్ వీడియో : సినీ అవకాశాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ గా అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోలో నల్ల చీర, స్లీవ్‌లెస్ జాకెట్ వేసుకుని అదిరిపోయే మాస్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. ఇందులో ఆమె నాభి, నడుము అందాలు చూపరులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆర్జే కాజల్ కూడా ఉన్న ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











