మల్లెపూలతో బిగ్‌బాస్ బ్యూటీ పీలింగ్స్ .. పెళ్లి తర్వాత ఇన్ని మార్పులా

బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతో మందిని ప్రజలకు పరిచయం చేసి వారికి క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో సినిమాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న నటీనటులకు కూడా బిగ్‌బాస్ కొత్త ఆశలు కల్పించింది. ఈ షోలో కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది తర్వాత బడా ప్రాజెక్ట్స్‌లో భాగస్వాములు అవుతున్నారు. ఇలాంటి వారిలో సోనియా ఆకుల కూడా ఒకరు. గతంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ , బిగ్‌బాస్ తర్వాతే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సోనియా 9వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్‌లో టెన్త్, హైదరాబాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. కొద్దిరోజులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సోనియా.. సినిమాలపై ఆసక్తితో తొలుత ' జార్జ్ రెడ్డి' సినిమాలో నటించింది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడిన ఆమె ఆయన దర్శకత్వంలో కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ వంటి సినిమాల్లో నటించి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

Bigg Boss fame sonia akula shares her latest srilanka vacation photos

ఈ దశలో బిగ్‌బాస్ తెలుగు 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్న సోనియా .. తన మైండ్ గేమ్‌తో ఆకట్టుకున్నారు. కన్నడ బ్యాచ్‌కి గట్టి పోటీ ఇచ్చి ఆడపులి అనిపించుకున్న సోనియా నాలుగు వారాలకే ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాకిచ్చింది. బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లాడానికి ముందే సోనియాకు యష్ అనే వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైంది. హౌస్‌ను వీడిన తర్వాత తన పెళ్లికి రావాలంటూ హోస్ట్ నాగార్జున, ఇతర కంటెస్టెంట్స్‌ని ఆమె ఆహ్వానించారు.

ఇటీవల యష్‌ - సోనియాల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహానికి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు. వాస్తవానికి యష్‌కి అంతకుముందే పెళ్లి అయ్యింది. అతనికి ఓ కొడుకు కూడా ఉన్నారు. అన్ని తెలిసి ఎందుకు అతనిని పెళ్లి చేసుకున్నారని సోనియాను పలువురు ప్రశ్నించారు. దీనికి ఈ జంట దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చారు. యష్ చెల్లెలు శ్వేత చివరి కోరిక తీర్చడానికి సోనియా ఆయనను పెళ్లాడినట్లుగా తెలిపారు.

పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లేమీ ప్రకటించని సోనియా ప్రస్తుతం భర్తతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో తొలి నుంచి యాక్టీవ్‌గా ఉండే సోనియా ఆకుల.. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా భర్తతో కలిసి శ్రీలంక ట్రిప్ వేసిన సోనియా ఓ ఆలయానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. మల్లెపూల దండలను పట్టుకుని, పక్షులు, జంతువులకు ఆహారం వేస్తున్న సోనియా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ బిగ్‌బాస్ ఆడపులి ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bigg boss sonia akula
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X