పెళ్లై కొడుకున్నా ఆయనతోనే పెళ్లి సిద్ధం.. ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
నటి, బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల త్వరలో పండంటి బిడ్డకు జన్మినివ్వబోతోంది. రీసెంట్ గానే ఆమెకు ఘనంగా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధించిన ఫొటోలను ఆమె, ఆమె భర్త అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సోనియా ఆకుల గత ఇంటర్వ్యూలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా సోనియా ఆకుల భర్త ఎవరు? బిగ్ బాస్ తర్వాత వారి పెళ్లి ఆలస్యంగా జరగడానికి కారణం ఏంటనే విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
సోనియా ఆకుల గురించి..
ఈమె తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి లో పుట్టి పెరిగింది. హైదరాబాద్ లోని భోజ్ రెడ్డి కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీలో పట్టా పొందింది. ఆ తర్వాత సినిమాలపై తనకున్న ఆసక్తితో పలు అవకాశం కోసం ప్రయత్నించింది. నటిగా రెండు మూడు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. హీరోయిన్ గా అలరించింది. మరోవైపు టీవీ షోల్లోనూ ఈమె మెరిసింది. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అలరించింది. 8వ సీజన్ లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాలుగు వారాల పాటు హౌజ్ లో అలరించింది.

జార్జి రెడ్డి చిత్రంతో ఫేమ్..
సోనియా ఆకుల నటించిన తొలిచిత్రం జార్జి రెడ్డి. ఈ చిత్రం 2019లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మూవీలో ఆమె జార్జిరెడ్డి చెల్లెలు పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్స్ కరోనా వైరస్, ఆశా ఎన్ కౌంటర్ వంటి చిత్రాల్లో లీడ్ రోల్ లో నటించి మెప్పించింది. చివరిగా తెలుగు టెలివిజన్ షో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లో అలరించింది. ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. మున్ముందు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
భర్త యష్ గురించి..
బిగ్ బాస్ నటి ఆకుల సోనియా ఇటీవలి ఇంటర్వ్యూలో తన భర్త గురించి కొన్ని విషయాలను చెప్పింది. ఆయనకు ముందే పెళ్లై విడాకులు కూడా అయ్యిందని, ఒక బాబు కూడా ఉన్నాడని వెల్లడించింది. ఇక తన పెళ్లి విషయంలో ఆలస్యమంటూ కొన్ని రూమర్లు వచ్చాయి. దానిపైనా క్లారిటీ ఇచ్చింది. తన భర్త యష్ వాళ్ల చెల్లి, నాన్న ఇలా వరుసగా చనిపోవడం కారణంగా తమ పెళ్లి ఆలస్యం అయ్యిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అన్ని కుదరడంతో పెళ్లి చేసుకుంది. ఇక రెండ్రోజుల కింద ఆమెకు ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.
ఇక సోనియా ఆకుల యష్ ను 2024లో పెళ్లి చేసుకుంది. వరంగల్ కు చెందిన యష్ వీరగోని ఎంతో కష్టపడి ఎదిగారని ఆమె చెప్పింది. అమెరికా వెళ్లి చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఫ్లై హై అనే సంస్థను కూడా స్థాపించారని వివరించింది. ఆయన అండర్ 16, అండర్ 19 క్రికెట్ కూడా ఆడారని చెప్పుకొచ్చింది. ఫ్లై హై సంస్థకు ఆయన ఓనర్ గానే కాకుండా విదేశాల్లో దావత్ అనే రెస్టారెంట్స్ ను కూడా నడిపిస్తున్నారని చెప్పింది. ఏదేమైనా ఆమె ప్రస్తుతం చక్కటి కుటుంబంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











