బేబీ బంప్‌తో బిగ్‌బాస్ బ్యూటీ .. మా ప్రేమకు ప్రతి రూపమిదే అంటూ..
Bigg Boss Soniya Akula: బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఆకుల (Soniya Akula)ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొన్న సోనియా తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఈ అమ్మడు తరువాత తన స్నేహితుడు యశ్ వీర్ ను పెళ్లి చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది. అయితే.. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తానెప్పుడు తల్లికాబోతున్నాననే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏమన్నారంటే?
సోనియా ఆకుల కెరీర్‌ను చూస్తే.. ఆమె ముందుగా మోడల్‌గా ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. 'జార్జిరెడ్డి' లో హీరో సిస్టర్ పాత్రలో నటించి, మెప్పించింది. ఆ తరువాత సన్సెషనల్ డైరెక్టర్ ఆర్జీవీ దర్శకత్వంలో "కరోనా వైరస్", "దిశా ఎన్‌కౌంటర్" సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టే అవకాశాన్ని కొట్టేసింది. ఈ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది, ప్రేక్షకుల్లో క్రేజ్ పెరిగింది.

బిగ్ బాస్ సీజన్ 8 సమయంలో సోనియా, హౌస్‌లోని నటులు నిఖిల్, పృథ్వితో సన్నిహితంగా ఉంటుందనే విమర్శలు వచ్చాయి. ఇద్దరితో ప్రేమాయణం నడుస్తుందని కథనాలు వస్తుండగా, సోనియా తల్లిదండ్రులు స్వయంగా వచ్చి ఈ వార్తలను ఖండించారు. "వాళ్లను ఆమె సోదరుల్లా భావిస్తుంది" అని క్లారిటీ ఇచ్చారు. హౌస్‌లో ఎక్కువ కాలం నిలవకపోయినా, ఆమె మాట్లాడే తీరు, కంఫర్ట్ జోన్‌కి ఎప్పుడూ భయపడకుండా వెళ్లే అటిట్యూడ్ అన్నీ కలిసి ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చాయి. అలాగే.. బిగ్ బాస్ రోజుల్లోనే సోనియా, తన ప్రియుడు యశ్వీర్ గొరోని గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ షో తర్వాత 2022 డిసెంబర్‌లో ఈ జంట వివాహ బంధంతో ఒకటిగా మారింది. అప్పటి నుంచే ఈ జంట సోషల్ మీడియాలో తమ జంట ఆనంద క్షణాలను పంచుకుంటూ ప్రేక్షకులతో కనెక్ట్ అవుతూనే ఉంది. తాజాగా తమ జీవితంలో కొత్త ఆరంభాన్ని ప్రకటిస్తూ సోనియా గర్భవతి అని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె సాధారణ పోస్టుతో కాకుండా ప్రత్యేకంగా ప్రకటించింది. "కాన్ఫిడెన్షియల్ ఫైల్"ను తన భర్తకు అందించి, అందులోని సందేశం చూసి తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు. ఆ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. సెలబ్రిటీలు, బిగ్ బాస్ అభిమానులు, నెటిజెన్లు అందరూ సోనియా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక తాజాగా సోనియా తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. తన ఆనందాన్ని మరో రెట్టింపు అయినట్టు తెలుపుతూ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. రొమాంటిక్, ఎమోషనల్ స్టిల్స్‌తో సోనియా-యశ్ వీర్ జంట ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "నిజమైన ప్రేమ అంటే ఇదే... ఇది మా ప్రేమ బంధానికి ప్రతీక.. మన కుటుంబం పెరుగుతోంది" అంటూ సోనియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో 'గాడ్ బ్లెస్, న్యూ జర్నీ, న్యూ హ్యాపీనెస్ అంటూ తన ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











