Soniya Akula : అచ్చ తెలుగు అందం.. చీర కట్టుతో చంపేస్తోన్న సోనియా ఆకుల
బిగ్‌బాస్ తెలుగు 8 ప్రారంభమయ్యాక ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారని ఓ పేరు ఎక్కువగా వినిపించింది. ఆవిడే సోనియా ఆకుల. బిగ్‌బాస్ దత్తపుత్రికగా పేరు తెచ్చుకున్న ఈమె పృథ్వీ, నిఖిల్‌లను అడ్డుపెట్టుకుని ఆట ఆడింది. చివరికి అదే ఆమె కొంపముంచి ఎలిమినేషన్‌కు కారణమైంది. అయితే పాయింట్‌పై ఆర్గ్యూమెంట్ చేయడంలో సోనియా దిట్ట. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక మరోసారి ఆమె రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే సీజన్‌కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడటంతో ఇక ఆమె రీ ఎంట్రీ లేనట్లేనని అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సోనియా ఆకుల .. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే
సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జన్మించిన ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం మంథని, హన్మకొండలలో జరిగింది. తర్వాత హైదరాబాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ అభ్యసించారు. కొంతకాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సోనియ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. ఇంజనీరింగ్ తర్వాత కొన్నాళ్లు వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారామె . సినీవారం అనే ప్రోగ్రామ్‌లో అవకాశం ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రజెంటేషన్ , చలాకీతనం చూసి సినిమాల్లో నటించమని సోనియాను ప్రోత్సహించారు.

జార్జ్ రెడ్డి సినిమాలో హీరోకి సోదరిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది . అనంతరం రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ చిత్రాలలో ఛాన్సులు దక్కించుకున్నారు సోనియా. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటున్నారు. ఆసా ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది అనాథ పిల్లలకు ఆర్ధిక సాయం, లాక్‌డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి, దిశా నిందితుడి భార్య రేణుకకి నెలకు రూ.15 వేల సాయం అందించారు. దాదాపు 50 మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో నిధుల సేకరణ చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు 8లో అనూహ్యంగా అవకాశం దక్కించుకుని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బిగ్‌బాస్‌లో ఆవిడపై కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు అంటారు. ఆమె క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసే విధంగా కొన్ని క్లిప్స్ వైరల్ అయ్యాయని .. లేదంటే సోనియా ఇంకా హౌస్‌లోనే ఉండేవారని ఆమె ఫ్యాన్స్ చెబుతుంటారు. మనసులో ఏం దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం కొందరికి నచ్చలేదని వారు అంటున్నారు.
సోనియా ఆకులకి ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి నిశ్చయమైంది. ఈ లోపు బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో ఇరు కుటుంబాల అనుమతితో ఆమె హౌస్‌లోకి వెళ్లొచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సోనియా ఆకుల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ శ్రీజ డిజైన్ చేసిన చీరలో సోనియా ఆకుల మెరిసిపోతున్నారు. కొబ్బరి చీట్ల నీడలో అచ్చ తెలుగు అమ్మాయిలా మత్తెక్కిస్తోన్న సోనియా ఫోటోలను మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











