Bigg Boss: తల్లైన బిగ్‌ బాస్‌ బ్యూటీ.. పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సోనియా..

Bigg Boss Soniya Akula: బిగ్‌బాస్ ఫేమ్ సోనియా ఆకుల (Soniya Akula) ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొన్న సోనియా తన గేమ్ స్టైల్ తో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన సోనియా తరువాత తన స్నేహితుడు యశ్ వీర్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తానెప్పుడు తల్లికాబోతున్నాననే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ వార్త ఏంటీ?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఎన్నాడు లేని విధంగా 9 సీజన్ ఊహించిన ట్విస్టులతో కొనసాగుతోంది. టైటిల్ విన్నర్ ఎవరు? టాప్ 5 లో ఎవరు నిలుస్తారు? రన్నరస్ ఎవరు? అనే విషయాలు చర్చనీయంగా మారింది. ఈ సమయంలో గత సీజన్‌లో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కంటెస్టెంట్ సోనియా ఆకుల మరోసారి వార్తల్లో నిలిచింది. ఎనిమిదో సీజన్‌లో తన ఆట తీరు, మాట్లాడే ధోరణి, బోల్డ్‌గా వ్యవహరించే స్టైల్‌తో సోనియా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Bigg Boss Fame Soniya Akula Welcomes Baby Girl Names Daughter Shikha Veeragoni

ఆ సీజన్ లో నిఖిల్, పృథ్వీతో చేసిన సరదా, 'పెద్దోడు,చిన్నోడు'అనే కామెంట్స్ ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటాయి. ఆమె హౌస్‌లో కొనసాగుతుందనే కొనసాగుతాయని, అందరూ భావించారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా సోనియా మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలు, కంట్రవర్సీలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బిగ్ బాస్ కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని ప్రస్తావించిన సోనియా.. బయటకొచ్చిన కొద్దికాలంలోనే ఎంటర్‌ప్రెన్యూర్ యశ్ వీర్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యింది. 2022 డిసెంబర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ జంట తరచూ తమ జీవితాన్నిసంతోషాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు.

తాజాగా సోనియా- యష్ దంపతులు ప్రేక్షకులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలోకి కొత్త మెంబర్ వచ్చిందనీ. పాప జన్మించిన విషయాన్ని సంతోషంగా ప్రకటించారు. డిసెంబర్ 08, 2025 న పండంటి కుమార్తె జన్మించిందని, "మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది.. మా జీవితం సంపూర్ణమైంది" అంటూ ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ బిడ్డకు 'శిఖా వీరగోని' అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సోనియా ఆకుల కెరీర్ విషయానికి వస్తే.. ఆమె మొదట మోడలింగ్‌ రంగంలో కెరీర్ ప్రారంభించింది. తరువాత 'జార్జ్ రెడ్డి' సినిమాలో హీరో సిస్టర్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్జీవీ దర్శకత్వం వహించిన కరోనా వైరస్, దిశా ఎన్‌కౌంటర్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్‌బాస్ సీజన్ 8లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. షోలో ఎక్కువకాలం నిలవకపోయినా, బిగ్‌బాస్ ద్వారా వచ్చిన గుర్తింపు, స్టార్డమ్ సోనియాకు మంచి కెరీర్ అవకాశాలను తెచ్చిపెట్టగా, ఇప్పుడు తల్లిగా మారి సోనియా తన జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించినట్టు చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X