మళ్లీ ప్రేమలో పడ్డాను.. ముద్దు పెట్టుకొంటానంటే వద్దన్నా.. క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి

బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిన శ్రీముఖి.. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది. బుల్లితెర రాములమ్మగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ షోతోనూ అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విజేతగా నిలవాల్సిన శ్రీముఖి.. ఆమె చేసిన స్వయం తప్పిదాలతో రన్నర్‌గానే మిగిలిపోయింది. తాజాగా లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్ బయటకు వచ్చేశాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Anchor Sreemukhi Confirms Her Relationship
రన్నర్‌గా మిగిలిన శ్రీముఖి..

రన్నర్‌గా మిగిలిన శ్రీముఖి..

బిగ్‌బాస్ మూడో సీజన్‌ కంటెస్టెంట్లందరిలోనూ బాగా పాపులార్టీ, క్రేజ్ ఉన్నది శ్రీముఖికే. షో మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఆమే విజేతగా నిలుస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే షో ముందుకు సాగుతున్న కొద్దీ.. రాహుల్-శ్రీముఖి వార్ ముదరడం, శ్రీముఖి ప్రవర్తనకు విసుగు చెందిన వీక్షకులు రాహుల్‌ను విజేతగా చేశారు.

తగ్గిన ఆఫర్స్..

తగ్గిన ఆఫర్స్..

బిగ్‌బాస్ షో కంటే ముందు క్షణం తీరిక లేకుండా గడిపే శ్రీముఖికి.. షో అనంతరం ఆఫర్స్ అంతగా రావడం లేదు. స్టార్ మ్యూజిక్ అనే ఓ ప్రోగ్రామ్ తప్పా మరో కొత్త షోను చేయలేదు. బిగ్‌బాస్ షో వల్ల అభిమాన గణం అయితే పెరిగింది కానీ.. అదే రేంజ్‌లో ఇమేజ్ డ్యామేజ్ అయినట్టు కనిపిస్తోంది.

తాజాగా లైవ్‌లో ప్రత్యక్షం..

తాజాగా లైవ్‌లో ప్రత్యక్షం..

సెలెబ్రిటీలందరూ తమ అభిమానులతో ముచ్చటించేందుక లైవ్‌లోకి వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీముఖికి కూడా లైవ్‌లోకి వచ్చి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఇక నెటిజన్స్ తమకు ఇష్టం వచ్చిన ప్రశ్నలను సంధించారు. అందులో కొన్నింటికి శ్రీముఖి జవాబులు ఇచ్చింది.

ప్రేమలో ఉన్నాను..

ప్రేమలో ఉన్నాను..

శ్రీముఖికి ఎదురైన ఈ ప్రశ్నల పరంపరలో ప్రేమ, పెళ్లికి సంబంధించినవీ ఉన్నాయి. మీరు ప్రేమలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అవును అంటూ చెప్పిన శ్రీముఖి.. `ఎవరైనా ముద్దు పెడతానంటే వద్దన్నారా? అని కొంటెగా ప్రశ్నించారు. దానికి ఏమాత్రం తడబడకుండా అంతే కొంటెగా.. అవును వద్దన్నానంటూ జవాబిచ్చింది. అయితే అదెవరన్న విషయం మాత్రం చెప్పలేదు. ఇక శ్రీముఖి ప్రేమను సొంతం చేసుకున్న ఆ అదృష్టవంతుడెవడోనని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X