వాటికి సర్జరీ చేయించుకున్న శ్రీసత్య.. మంచిగా ఉండేవి పాడు చేసుకున్నావు అంటూ!

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి హైలైట్ అయ్యారు. అలాంటి వారిలో శ్రీ సత్య ఒకరు. సీరియల్ నటిగా ఫుల్ పాపులర్ అయిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా చాలా కాలంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసమే!

మిస్ ఆంధ్రా.. రామ్‌తోనే
తెలుగు అమ్మాయి శ్రీ సత్య మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ చిన్నది.. మిస్ ఆంధ్రాగా గెలిచింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా చాలా బ్రాండ్లకు పని చేసింది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో రామ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' మూవీల్లో నటించింది.

Bigg Boss Fame Sri Satya Did Plastic Surgery for Lips News Gone Hot Topic

సీరియల్ నటిగా ఫేమస్

చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా శ్రీ సత్యకు గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌తో అలరించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ నటించి శ్రీ సత్య తెలుగు రాష్ట్రాల్లో మంచిగా ఫేమస్ అయింది.

Bigg Boss Fame Sri Satya Did Plastic Surgery for Lips News Gone Hot Topic

బిగ్ బాస్‌తో ఫుల్‌గా క్రేజ్
వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ దూసుకుపోతోన్న శ్రీ సత్య.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో మెప్పించింది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది. దీని తర్వాత ఆమె 'బీబీ జోడీ' చేసింది. తర్వాత 'సూపర్ జోడీ'లో విన్నర్ అయింది.

అందులో సందడిగానే

చాలా కాలంగా వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తనదైన రీతిలో ముందుకు సాగుతోన్నా.. శ్రీ సత్య మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం ద్వారా ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌లో పెంచుకుంటోంది.

Bigg Boss Fame Sri Satya Did Plastic Surgery for Lips News Gone Hot Topic

వాటిని హైలైట్ చేస్తూ
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న తెలుగు అమ్మాయి శ్రీ సత్య.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనూ తనదైన రీతిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా తరచూ ఫొటోలను షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వదిలిన ఫొటోల్లో శ్రీ సత్య ముఖంలో ప్రధానమైన మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తూ తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు.

Bigg Boss Fame Sri Satya Did Plastic Surgery for Lips News Gone Hot Topic

వాటికి సర్జరీ అవడంతో

తాజాగా శ్రీ సత్య కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పెదాలు గతంలో మాదిరిగా కాకుండా రూపం మారినట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ తెలుగు పిల్ల వాటికి సర్జరీ చేయించుకుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అలాగే, 'మంచిగా ఉన్న వాటిని పాడు చేసుకున్నావు', 'ఆ లిప్స్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది' అంటూ నానా రకాలుగా కామెంట్లను పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X