నవ్వడం తప్పా? సపోర్ట్ చేస్తే కాంట్రవర్సీ... ట్రోల్స్‌పై బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ సత్య (Sri Satya) తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. సీరియల్స్, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొని తనపై జరుగుతున్న ట్రోలింగ్, కాంట్రవర్సీలపై ఓపెన్‌గా మాట్లాడింది. ముఖ్యంగా చిన్న విషయాలను కూడా పెద్ద వివాదాలుగా మలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా 'కిసిక్ టాక్స్' అనే షోలో పాల్గొన్న శ్రీ సత్య, రియాలిటీ షోల వెనుక ఉన్న పీఆర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ మాత్రమే కాకుండా, ఇతర షోలు కూడా పీఆర్ టీమ్స్ ద్వారా నడుస్తున్నాయని, కంటెస్టెంట్స్‌కు అనుకూలంగా కామెంట్స్ మేనేజ్ చేస్తున్నారని తెలిపింది. ఇది ప్రేక్షకులు గమనిస్తే సులభంగా అర్థమవుతుందని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక తనపై వస్తున్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుతూ 'లైవ్ స్ట్రీమ్‌లో నేను నవ్వితే కూడా దాన్ని కాంట్రవర్సీగా మార్చేస్తున్నారు. అది నా తప్పా?'అంటూ ప్రశ్నించింది.

Bigg Boss Fame Sri Satya Gets Emotional Over Trolls Is It Wrong to Smile or Support

తాను ఎవరి గురించి నేరుగా మాట్లాడకపోయినా, కేవలం నవ్వినందుకే తనను వివాదాల్లోకి లాగుతున్నారని చెప్పింది. 'నాకు నచ్చిన వారిని నేను సపోర్ట్ చేస్తాను. అందులో తప్పేంటి?'అంటూ ట్రోల్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని శ్రీ సత్య వెల్లడించింది. బిగ్ బాస్ సమయంలో ఒక కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేసినందుకు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొన్నానని తెలిపింది.

'ఒక ఆడపిల్లగా మరో ఆడపిల్లకు సపోర్ట్ చేయవా?' అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారని, అదే విధంగా మరో కంటెస్టెంట్‌కు మద్దతు ఇచ్చినా విమర్శలు తప్పలేదని చెప్పింది. తన సోషల్ మీడియా పోస్టులకే కూడా ట్రోల్స్ ఇష్టం వచ్చినట్లు స్పందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.'ఎవరికీ హాని చేయకుండా ఉంటే కూడా ఇలా ట్రోల్ చేయడం సరికాదు. ఎవరికైనా నష్టం చేస్తే అది ఒక రోజు తిరిగి వస్తుంది. కర్మ తప్పకుండా పని చేస్తుంది' అంటూ ఆమె గట్టిగా స్పందించింది. ఈ వివాదాలన్నింటినీ దూరంగా ఉంచుకుని తనకు నచ్చినట్లు జీవించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ట్రోల్స్ మాత్రం వదలడం లేదని ఎమోషనల్ అయ్యింది.

ఇక ప్రస్తుతం చేస్తున్న 'బీబీ జోడి' డాన్స్ షో గురించి కూడా శ్రీ సత్య మాట్లాడింది. ఈ షోలో తనకు నచ్చిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుండటంపై బాధ వ్యక్తం చేసింది. ముఖ్యంగా తనకు ఫేవరెట్ అయిన చైతు వెళ్లిపోవడం తాను ఫీల్ అయ్యానని చెప్పింది. ఈ సీజన్ విన్నర్‌గా అమర్ లేదా మానస్‌లో ఎవరో ఒకరు నిలవొచ్చని అంచనా వేసింది.

ఇక తన వ్యక్తిగత జీవితంపై కూడా శ్రీ సత్య ఓపెన్ అయింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. "నా తల్లిదండ్రులను వదిలి వెళ్లడం నాకు సాధ్యం కాదు" అని చెప్పింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలంటే, తన తల్లిదండ్రులను కూడా తనవారిలా చూసుకునే వ్యక్తి కావాలని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇక హీరో రామ్ పోతినేనీ ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు అని అడగగా, 'చిన్నప్పటి నుంచి రామ్ అంటే ఇష్టం. కానీ అలాంటిది నిజంగా జరిగితే నేనే షాక్ అయిపోతాను' అంటూ నవ్వులు పూయించింది. సోషల్ మీడియా ట్రోల్స్ మాత్రం తనను విడిచిపెట్టడం లేదని చెప్పిన ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X