నావి పెద్దగా అయ్యాయి.. అందరూ అవే చూస్తున్నారు: శ్రీ సత్య షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు చాలా మంది తెలుగు అమ్మాయిలు బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూ సెలెబ్రిటీలుగా హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ నటి శ్రీ సత్య ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసుకునే అందం, అదిరిపోయే నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఈ మధ్య కాలంలో చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న వార్త ఒకటి వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై ఆమె అసలైన క్లారిటీ ఇచ్చేసింది. ఆ సంగతులను మీరే చూడండి!
అలా వచ్చి సీరియళ్లలో
మోడల్‌గా ప్రయాణాన్ని ఆరంభించిన శ్రీ సత్య మిస్ ఆంధ్రాగా గెలిచింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 'నేను శైలజ' సినిమాతో ఎంటరైంది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' మూవీల్లో నటించింది. ఆ తర్వాత 'ముద్ద మందారం', 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్ చేసింది.

బిగ్ బాస్‌తో వరుసగానే
కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ దూసుకుపోతోన్న శ్రీ సత్య.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులో అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో వెళ్లిపోయింది. దీని తర్వాత శ్రీ సత్య 'బీబీ జోడీ' చేసింది. అయితే, ఇటీవలే ఆమె 'సూపర్ జోడీ'లో విన్నర్ అయింది.
అందులో యాక్టివ్‌గానే
చేతి నిండా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్న శ్రీ సత్య కెరీర్ పరంగా తనదైన రీతిలో ముందుకు సాగుతోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం ద్వారా ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

వాటికి సర్జరీ అయింది
శ్రీ సత్య ఇటీవలే కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పెదాలు గతంలో మాదిరిగా కాకుండా మరింత పెద్దగా కనిపించాయి. దీంతో ఈ తెలుగు హీరోయిన్ వాటికి సర్జరీ చేయించుకుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అప్పటి నుంచి చాలా మంది ఆమె అభిమానులు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ న్యూస్ ఇటీవల హాట్ టాపిక్ అయిపోయింది.
సర్జరీ చేయించుకున్నా
తెలుగు అమ్మాయి శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ న్యూస్ హైలైట్ అవుతోన్న నేపథ్యంలో తాజాగా ఆమె దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై వివరణ ఇచ్చింది. 'అందరూ అనుకుంటున్నట్లుగానే నేను ఇటీవలే పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. కొంత మంది సలహా ఇవ్వడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నా' అని చెప్పింది.

అందరూ చూస్తున్నారు
తన ప్లాస్టిక్ సర్జరీ గురించి శ్రీ సత్య మాట్లాడుతూ.. 'నేను పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత అవి చాలా ఆకర్షణీయంగా మారినట్లు కొందరు నాతో చెప్పారు. గతంలో ఇవి పెద్దగా మారాయి. దీంతో అందరూ నా ముఖంలో వాటినే చూస్తున్నారు. అంతేకాదు, గతంలో కంటే ఇప్పుడు నీ ముఖం బాగుందని చెబుతున్నారు' అంటూ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











