బౌండరీ దాటిన శ్రీ సత్య హాట్ షో: ఎద అందాలను అలా పైకి చూపిస్తూ!
తొలి తరంలో తెలుగు ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలే ఎక్కువగా కనిపించే వాళ్లు. కానీ, ఆ తర్వాత వీళ్ల సంఖ్య చాలా దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఎంతో మంది తెలుగు అమ్మాయిలు వెలుగులోకి రావడంతో పాటు అవకాశాలను దక్కించుకుంటోన్నారు.
అందులో శ్రీ సత్య ఒకరు. సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. సీరియల్స్ ద్వారా యమ పాపులర్ అయింది. దీంతో చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసం!

రామ్‌కు గర్ల్‌ఫ్రెండ్‌గా: తెలుగు అమ్మాయి అయిన శ్రీ సత్య మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా చాలా అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రాగా గెలిచి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అప్పుడే ఏకంగా 'నేను శైలజ' సినిమాలో రామ్ లవర్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్'లోనూ నటించింది.
సీరియళ్లతో ఫేమస్: నటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీ సత్య చాలా కాలం పాటు వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లను కూడా చేసిన శ్రీ సత్య ఫుల్ ఫేమస్‌గా మారింది.

బిగ్ బాస్‌తో హైలైట్: ఒకవైపు సినిమాలు.. మరోవైపు సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకపోతోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో మెప్పించింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ ప్రేక్షకులకు చేరువ అయింది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి చివరి వారంలో బయటకెళ్లింది.
అది షాక్.. ఆఫర్లతో: బిగ్ బాస్‌లో ఫినాలే వీక్‌లో ఎలిమినేటైన శ్రీ సత్య.. ఈ షో కారణంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే ముగిసిన 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా చేసింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చి ఓడారు. ఇక, ఇప్పుడు శ్రీ సత్య సీరియల్, సినిమాల ఆఫర్లను దక్కించుకుంటోంది.

సోషల్ మీడియాలో: నటిగా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్న.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలూ వదులుతోంది.
హాట్ షో చేస్తోందిగా: సాదారణంగా సీరియళ్లలో సంప్రదాయంగా కనిపించే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇక, ఈ మధ్య కాలంలో కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఈ బ్యూటీ తరచూ హైలైట్ అవుతోంది.

చిన్న డ్రెస్‌తో రచ్చ: తెలుగు పిల్ల శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు చాలా చిన్న డ్రెస్ వేసుకుని ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తోంది. ఇందులో ఎద, తొడల అందాలను చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











