అతి చిన్న డ్రెస్‌లో శ్రీ సత్య: ఆ హీరోయిన్లకు మించేలా బోల్డు షో
తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ గతంలో కంటే ఇప్పుడు లోకల్ అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు. వీళ్లే అందం, అభినయం సహా ఎన్నో టాలెంట్లను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో క్యూట్ లేడీ శ్రీ సత్య ఒకరు.
చాలా ఏళ్ల క్రితమే గ్లామర్ ఫీల్డులోకి అడుగు పెట్టిన ఈ భామ.. ముందుగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత టీవీ రంగంలోకి వచ్చింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే శ్రీ సత్య.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

హీరో రామ్ ప్రేయసిగా చేసి: అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ సత్య ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రాగా గెలిచి హైలైట్ అయింది. దీంతో ఆమెకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అప్పుడే ఏకంగా 'నేను శైలజ' సినిమాలో రామ్‌కు లవర్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్'లోనూ చేసింది.

సీరియళ్లతో శ్రీ సత్యకు క్రేజ్: సినిమాల్లోకి ఎంటరైన తర్వాత శ్రీ సత్య ఎన్నో రకాల ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లను కూడా చేయడంతో శ్రీ సత్యకు క్రేజ్ ఫుల్‌గా వచ్చింది.

బిగ్ బాస్‌తో ఫుల్ హైలైట్‌గా: వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో అలరించింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి చివరి వారంలో ఎలిమినేట్ అయిపోయింది.

జోడీలో షాక్... ఆఫర్లు డల్: బిగ్ బాస్ షోలో గెలవకున్నా శ్రీ సత్యకు ఫాలోయింగ్, పేరు బాగా పెరిగిపోయాయి. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ముగిసిన 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా చేసింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చి ఓడారు. దీని తర్వాత ఆమె సత్తా చాటుతుందని అంతా అనుకున్నా.. ఎందుకనో పెద్దగా ఆఫర్లు తెచ్చుకోవట్లేదు.

అందులో యమ బిజీగానే: ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్న.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.
అప్పుడప్పుడూ అవి కూడా: స్క్రీన్‌పై కనిపించేటప్పుడు డీసెంట్‌గా ఉండే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇక, ఈ మధ్య కాలంలో కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఈ బ్యూటీ తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

షార్ట్ డ్రెస్‌లో శ్రీ సత్య రచ్చ: తెలుగు అమ్మాయి శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు అతి చిన్న డ్రెస్ వేసుకుని ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చి కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











