ఐ లవ్ యూ చెప్పగానే బ్లాక్ చేశాడు.. ఆ హీరో అంటే పిచ్చి అంటున్న బిగ్ బాస్ బ్యూటీ

బుల్లితెర నుంచి సోషల్ మీడియా వరకు తన అందం, యాక్టింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఓ బిగ్ బాస్ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుని, తర్వాత షార్ట్ వీడియోలతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ అమ్మడు, రియాలిటీ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. అయితే కెరీర్ ప్రారంభ దశలో చేసిన ఒక చిన్న పని ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తన అభిమాన స్టార్ హీరోకు 'ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పంపడంతో, ఆ హీరో ఆమె నెంబర్‌ను బ్లాక్ చేశాడట. ఈ సంఘటన అప్పట్లో ఆమెకు షాక్ ఇచ్చినా, ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఏం జరిగింది?

Also Read
ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..
ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి శ్రీ సత్య. విజయవాడకు చెందిన శ్రీ సత్య, మొదట మోడలింగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మిస్ ఏపీ టైటిల్ గెలుచుకుని, ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ప్రారంభంలో సినిమాల్లో చిన్న పాత్రలు చేసినా, ఆమెకు అసలైన గుర్తింపు మాత్రం సీరియల్స్ ద్వారానే వచ్చింది. నిన్నే పెళ్లాడతా, ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.

Bigg Boss fame Sri Satya Love Message to Ram Pothineni Ends in Block Story Goes Viral
Recommended For You
Peddi: 'పెద్ది' లో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి నలుగురు హీరోయిన్స్ తో రామ్ చరణ్?
Peddi: 'పెద్ది' లో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి నలుగురు హీరోయిన్స్ తో రామ్ చరణ్?

ఆ తర్వాత సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, వెబ్ కంటెంట్‌తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ఫేమ్‌ కారణంగా రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌లో అవకాశం దక్కించుకుంది. అక్కడ కూడా తన స్ట్రాటజీ, గేమ్‌తో మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉంది. అయితే.. ఈ అమ్మడు ఆమె గతంలో చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. తన ఫేవరెట్ హీరోగా రామ్ పోతినేని (Ram Pothineni)ని పేర్కొన్న శ్రీ సత్య, ఆయనపై ఉన్న అభిమానాన్ని ఒకసారి ఓవర్‌గా వ్యక్తం చేసిందట.

You May Also Like
పిల్లల్ని కనాలని ఉంది.. రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల క్లారిటీ
పిల్లల్ని కనాలని ఉంది.. రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల క్లారిటీ

నేను శైలజా (Nenu Sailaja) సినిమా షూటింగ్ సమయంలో రామ్ పోతినేని ఫోన్ నెంబర్ సంపాదించుకుందట. దీంతో తన అభిమానాన్ని ఆపుకోలేక వెంటనే. 'హాయ్... ఐ లవ్ యూ' అంటూ వాట్సాప్‌లో మెసేజ్ పంపించిందట. అయితే ఆ మెసేజ్ చూసిన వెంటనే రామ్ ఆమె నెంబర్‌ను బ్లాక్ చేశాడని చెప్పింది. ఈ ఘటనతో తాను షాక్ అయ్యానని ఎమోషనల్ అయ్యింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, 'ఆ సమయంలో నేను చాలా చిన్నదాన్ని.. తెలిసీ తెలియని వయసులో అలా చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తుంది'అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే, అది సీరియస్ లవ్ కాదని, తన అభిమానాన్ని అలా వ్యక్తం చేశానని చెప్పింది.

ఇంతకీ ఆమె ఎవరు ? బిగ్‌బాస్ మాధురి‌పై పెద్ది హీరోయిన్ ఫైర్!
ఇంతకీ ఆమె ఎవరు ? బిగ్‌బాస్ మాధురి‌పై పెద్ది హీరోయిన్ ఫైర్!

మరోవైపు.. ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండి, ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లిందని, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి జరగలేదని ప్రచారం ఉంది. అయితే దీనిపై అధికారికంగా ఆమె నుంచి స్పష్టత మాత్రం లేదు. మొత్తంగా చూస్తే, ఒక చిన్న వయసులో జరిగిన ఈ 'లవ్ మెసేజ్' ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, శ్రీ సత్య పేరును మళ్లీ ట్రెండ్‌లోకి తెచ్చింది. బిగ్‌బాస్ తర్వాత వచ్చిన ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని, ఆమె ఇప్పుడు కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X