ప్రేమ పేరుతో మోసం.. బ్రేకప్ షాక్‌తో సూసైడ్.. బిగ్ బాస్ బ్యూటీ కన్నీటి కథ..

బుల్లితెర నుంచి సోషల్ మీడియా వరకు మంచి గుర్తింపు అందుకుంది. తన అందం, యాక్టింగ్‌తో క్రేజ్ సంపాదించుకున్న నటి బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత ఢీ అనే డ్యాన్స్ షోలో కూడా ఛాన్స్ కొట్టేసింది. అయితే.. ఈ బిగ్ బాస్ బ్యూటీకి సంబంధించిన పాత ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. కెరీర్ ప్రారంభంలో ఓ వ్యక్తి డబ్బు కోసం ప్రేమించి, తర్వాత బ్రేకప్ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైందట. ఆ సమయంలో ఆ షాక్‌ను తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు? అసలు ఏం జరిగింది?

ఆ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన నటి శ్రీ సత్య (Sri Satya). విజయవాడకు చెందిన ఈ అమ్మడు మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది. మిస్ ఏపీ టైటిల్ గెలుచుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదట సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆ తరువాత నిన్నే పెళ్లాడతా, ముద్ద మందారం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత సోషల్ మీడియాలో షార్ట్ వీడియోలు, వెబ్ కంటెంట్ ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించి, అదే క్రేజ్‌తో బిగ్ బాస్ షోలో అవకాశం దక్కించుకుంది. అక్కడ తన ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Bigg Boss Fame Sri Satya Shocking Breakup Story Suicide Attempt Revealed in Kissik Talks

ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉంది. సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన శ్రీ సత్య, బిగ్ బాస్ షోతో మరింత ఫేమ్ సంపాదించి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా విడుదలైన ప్రోమోలో తన లవ్ బ్రేకప్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఈ టాక్ షోలో పాల్గొన్న శ్రీ సత్య మాట్లాడుతూ..'నా వల్ల బ్రేకప్ జరిగితే నేను ఎందుకు బాధపడతాను? ఆ బ్రేకప్‌కు కారణం అతడే' అంటూ స్పష్టం చేశారు. తనను ప్రేమించిన వ్యక్తి చివరకు డబ్బు కోసం దూరమయ్యాడని, అదే తన జీవితాన్ని కుదిపేసిందని చెప్పారు.

ఆ సంఘటన తనకు తీవ్ర మానసిక వేదన కలిగించడంతో, ఒక దశలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని చెప్పడం షాకింగ్‌గా మారింది. ఇక ఈ బ్రేకప్ ప్రభావం తన కుటుంబంపై కూడా పడిందని శ్రీ సత్య కన్నీటి పర్యంతమయ్యారు. 'నా బ్రేకప్, నేను చేసిన ప్రయత్నం ఇవన్నీ చూసి మా అమ్మ తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యారు' అని తెలిపారు. ఆమె ఆరోగ్యం క్షీణించి, మాట్లాడలేని పరిస్థితికి చేరుకుందని, దాదాపు సంవత్సరం పాటు హాస్పిటల్‌లో చికిత్స చేయించాల్సి వచ్చిందని చెప్పారు. ఫిజియోథెరపీ కూడా ఎక్కువగా చేయించడంతో మరిన్ని సమస్యలు వచ్చాయని వెల్లడించారు.

ప్రస్తుతం తన తల్లి వీల్‌చైర్‌కే పరిమితమై ఉండడం తనకు ఎంతో బాధగా ఉందని, 'అమ్మ ఇలా ఉండటానికి నేనే కారణం' అంటూ శ్రీ సత్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను సంపాదించే డబ్బు మొత్తం తల్లి చికిత్సకే ఖర్చవుతుందని కూడా వెల్లడించారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో శ్రీ సత్య చెప్పిన విషయాలు ప్రేక్షకులను కదిలించాయి. ప్రేమలో జరిగిన మోసం, దాని వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి, కుటుంబంపై పడిన ప్రభావం అన్ని కలిసి ఈ కథను మరింత భావోద్వేగంగా మార్చాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X