'మా నాన్నకు బ్రేకప్.. నాకు బ్రేకప్.. ఇద్దరం కలిసి అలా బాధను పంచుకొంటాం'

బిగ్ బాస్ ద్వారా గుర్తింపు పొందిన నటి శ్రీ సత్య (Sri Satya) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. బుల్లితెర సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు,ముద్దమందారం, నిన్నే పెళ్లాడతా, త్రినయని వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అయితే.. ఈ సీరియల్స్ తో అంతపెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు6 లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించింది. బిగ్ బాస్ హౌస్‌లో తన యాటిట్యూడ్, మాట్లాడే స్టైల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రీ సత్య, ఇటీవల బీబీ జోడి వంటి షోలో పాల్గొని బుల్లితెరపై తన ఉనికిని కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

బిగ్ బాస్ శ్రీ సత్య ఇటీవల ఒక కిస్సిక్ టాక్ షోలో పాల్గొంది. ఈ సమయంలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంచలన విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించిన వర్ష ( Varsha)అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

ఇంటర్వ్యూలో భాగంగా మద్యం, సిగరెట్ అలవాట్ల గురించి ప్రశ్నించగా, మొదట తాను సిగరెట్ తాగనని చెప్పిన, తనకు మద్యం అలవాటు ఉందని చెప్పింది. మరి ఏ బ్రాండ్ అని ప్రశ్నింగా.. 'మా డాడీ ఏ బ్రాండ్ తీసుకొస్తే అదే తాగుతాను' అంటూ సరదాగా కామెంట్ చేసింది. ఈ సమాధానం విన్న యాంకర్ వర్ష 'మీరు నిజంగా తండ్రి-కూతుళ్లేనా? లేక ఫ్రెండ్సా?' అని ప్రశ్నించగా, శ్రీ సత్య 'మేమిద్దరం ఫాదర్-డాటర్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం' అని తెలిపింది.

Bigg Boss fame Sri Satya Shocking Comments on Father Bond Love Breakup and Party Life Go Viral

తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, 'నా బాధ, సంతోషం, బ్రేకప్ అన్నీ ఆయనతోనే పంచుకుంటా. వాస్తవానికి మా నాన్న కూడా బ్రేకప్ అయ్యింది. అలాగే మా నాన్నకు కూడా ఏదైనా బాధ ఉంటే నాతోనే చెప్పుకుంటాడు. అందుకే మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేస్తాం'అని చెప్పింది. ఇంకా సరదాగా 'కొన్ని సందర్భాల్లో కలిసి బయటికి వెళ్లి డ్రింక్ కూడా చేస్తాం' అంటూ చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

లవ్, మ్యారేజ్ గురించి మాట్లాడిన ఆమె, 'నా నాన్న ఎప్పుడూ చెబుతుంటాడు. నచ్చిన వ్యక్తిని తీసుకుని పెళ్లి చేసుకో అని. ఆ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు' అని తెలిపింది. అదే సమయంలో "నాకు లేదా నా నాన్నకు మూడ్ బాగోలేకపోతే ఇద్దరం కలిసి బయటికి వెళ్తాం. ఆ టైంలో మమ్మీ ఫోన్ చేస్తే సినిమాకి వచ్చామని లేదా పక్కనే ఉన్నామని చెప్పేస్తాం" అంటూ నవ్వుతూ చెప్పింది.

ఇంకా పబ్‌లకు వెళ్లే సందర్భాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "పబ్‌లో ఎవరైనా గుడ్ లుకింగ్ అబ్బాయిలు కనిపిస్తే వెంటనే మా నాన్నకు చెబుతా. ఆయన మాత్రం 'ఇంకో వాడు బాగున్నాడు' అంటూ నా ఆప్షన్‌ను రిజెక్ట్ చేస్తాడు. అప్పుడే మేమిద్దరం జడ్జ్ చేస్తూ సరదాగా టైమ్ పాస్ చేస్తాం" అని వెల్లడించింది. అదేవిధంగా, తనపై తన తండ్రి ఉంచిన నమ్మకం గురించి కూడా ఆమె మాట్లాడింది. "నేను రాత్రి రెండు గంటలకు బయటికి వెళ్తానన్నా కూడా మా నాన్న నన్ను అడ్డుకోడు. ఆయన నాకు చాలా ట్రస్ట్ ఇస్తాడు. ఆ నమ్మకాన్ని నేను ఎప్పటికీ దెబ్బతీయను. అందుకే ఏ తప్పు చేయాలన్నా భయపడతా" అని ఆమె చెప్పింది.

ప్రస్తుతం శ్రీ సత్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు ఆమె ఓపెన్‌నెస్, ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ తరహా వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా, మరోసారి శ్రీ సత్య తన వ్యక్తిగత విషయాలతోనే న్యూస్‌లో నిలవడం మాత్రం నిజం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X