ఏడో తరగతిలో అలాంటి వేధింపులు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా అలా..

బిగ్‌బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ బ్యూటీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. చిన్నతనంలో ఎదురైన లైంగిక వేధింపులు, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలు, క్యాస్టింగ్ కౌచ్ తరహా అనుభవాల గురించి వెల్లడించింది. ఈ బ్యూటీ ఓపెన్‌గా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు. 'ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు నాతో జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను' అంటూ ఎమోషనల్ అయింది ఆ బిగ్‌బాస్ బ్యూటీ. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు?

ఆ బిగ్‌బాస్ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఫేమ్ శ్రీ సత్య (Sri Satya). గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా క్యూట్ లుక్స్, చలాకీ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శ్రీ సత్య.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మాత్రం ఎంతో భావోద్వేగంగా బయటపెట్టింది. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన లైంగిక వేధింపులు, ఇండస్ట్రీలో ఎదురైన అవమానాలు, క్యాస్టింగ్ కౌచ్ తరహా అనుభవాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే పెద్ద చర్చకు దారితీశాయి.

Bigg Boss Fame Sri Satya s Shocking Throwback Interview on Harassment Goes Viral

సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన శ్రీ సత్య.. బిగ్‌బాస్ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాదించింది. హౌస్‌లో తన ప్రవర్తన, మాట తీరు, ఎమోషనల్ కనెక్షన్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. షో ముగిసిన తర్వాత టీవీ కార్యక్రమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్, స్పెషల్ వీడియోలతో బిజీగా మారిన ఆమె.. ఒక టాక్ షోలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి పలు సంచలన విషయాలను పంచుకుంది.

ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూలో శ్రీ సత్య మాట్లాడుతూ..'చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా జీవితంలో, ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఏడో తరగతిలో చదువుతున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ తనను వెంటాడుతుందని చెప్పి భావోద్వేగానికి గురైంది.'నేను స్కూల్ నుంచి వస్తుండగా ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తూ నా నడుము గిల్లి వెళ్లిపోయాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ ముందుకు వచ్చి ఆపలేదు' అంటూ ఆమె చెప్పిన మాటలు షాకింగ్‌గా మారాయి.

ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు అంత సులభంగా మారలేదని శ్రీ సత్య వెల్లడించింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తాను కూడా పరోక్ష వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. "ఇప్పటికీ అలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఎవరూ నేరుగా అడగరు. చుట్టూ తిరిగి మాట్లాడుతుంటారు" అంటూ ఇండస్ట్రీలోని పరిస్థితులను బయటపెట్టింది. అంతేకాదు.. ఆడిషన్స్, ఫోటోషూట్లు చేసిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టుల నుంచి తనను తప్పించారని ఆమె చెప్పింది. "ఎంతో ఆశతో సినిమాల కోసం ప్రయత్నిస్తాం. కానీ చివరి నిమిషంలో తీసేయడం చాలా బాధ కలిగిస్తుంది" అంటూ భావోద్వేగానికి గురైంది.

టెలివిజన్ షోల సమయంలో కూడా అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయని శ్రీ సత్య చెప్పిన విషయాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. "మేకప్ రూమ్‌లో మేకప్ వేసుకుంటుంటే నా బ్యాగ్ బయటకు విసిరేశారు. ఎవరితో పడితే వాళ్లతో షేర్ చేసుకుంటామా అంటూ మాట్లాడారు" అని ఆమె వెల్లడించింది. ఈ సంఘటనలు తనను మానసికంగా ఎంతో బాధించాయని చెప్పింది. ప్రస్తుతం ఈ థ్రోబ్యాక్ ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: sri satya bigg boss telugu 6
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X