పూసల దండతో నాభిని కవర్ చేస్తూ .. బ్లూ శారీలో సెగలు రేపుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ

భారతదేశంలో నెంబర్‌వన్ రియాలిటీ గేమ్ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన ఎంతో మంది నేడు స్టార్స్‌గా రాణిస్తున్నారు. వీరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, నటీనటులు కూడా ఉన్నారు. ఎన్నో సినిమాలు , షోలు చేసినా రాని గుర్తింపు కొందరికి బిగ్‌బాస్ ద్వారా వచ్చింది. ఈ కోవకే వస్తారు శుభశ్రీ రాయగురు. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ అయిన ఈమె తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1997 ఏప్రిల్ 15న ఒడిశాలో పుట్టి పెరిగారు శుభశ్రీ రాయగురు. ముంబైలోని కేంద్రీయ విద్యాలయంలో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యింది. చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం సంపాదించారు శుభశ్రీ. హైస్కూల్ స్థాయిలో ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ సహా పలు క్రీడల్లో ఆమె రాణించారు. అనంతరం కేవీ లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ఆమె కొంతకాలం లాయర్‌గానూ ప్రాక్టీస్ చేశారు.

bigg boss fame Subhashree Rayaguru PhotoShoot With blue color saree Her latest photos here

కాలేజీలో చదువుకునే రోజుల్లో మోడలింగ్‌ చేసిన శుభశ్రీ.. వీల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా 2020 కిరీటాన్ని గెలుచుకున్నారు. తర్వాత బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ కూడా చేశారు రాయగురు. నటనపై ఆసక్తితో హైదరాబాద్ చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించిన శుభశ్రీ 2022లో వచ్చిన రుద్రవీణ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళ్‌లో డెవిల్ మూవీ ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించారు. అనంతరం అమిగోస్, కథ వెనుక కథ వంటి చిత్రాల్లో నటించి సత్తా చాటారు శుభశ్రీ.

బుల్లితెర, వెండితెరపై వచ్చిన గుర్తింపుతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో శుభశ్రీ అవకాశం దక్కించుకుని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తన ఆటతీరు, అందంతో అందరికీ చేరువైన శుభశ్రీ .. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వరుసపెట్టి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. రీసెంట్‌గా కాకినాడ కాజా అంటూ తన వొంపు సొంపులు, డ్యాన్స్‌తో మాస్‌ను ఊపేశారు శుభశ్రీ.

గత నెలలో శుభశ్రీ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తుండగా.. అక్టోబర్ 6న ఆమె కారును ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. నాగార్జున సాగర్ బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి అతి వేగంగా బైక్ నడిపుతూ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. శుభశ్రీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శుభశ్రీ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, షోలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ శారీలో పైట పక్కకి జరిపి , నడుముకు పూసల దండ పెట్టి దాని సాయంతో నాభిని కవర్ చేస్తున్న ఫోటోలు కాక రేపుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X