‘బాడీ షేమింగ్‌తో కుమిలిపోయా.. పెళ్లి చేసుకోవాలంటే నటి అలాంటి కండీషన్’
బిగ్‌బాస్ ద్వారా పాపులరై, జీవితంలో టాప్ రేంజ్‌కి వెళ్లినవారు ఎందరో ఉన్నారు. అలా బిగ్‌బాస్ షో వల్ల లాభపడిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే? అలాంటి వారిలో టేస్టీ తేజా ఒకరు. బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉన్న వారిలోనూ ఆయన కూడా ఒకరు. బిగ్‌బాస్ సీజన్ 7లో 9 వారాలు.. సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 13వ వారం వరకు హౌస్‌లో ఉన్నాడు. బిగ్‌బాస్‌తో క్రేజ్‌తో పాటు భారీగా రెమ్యునరేషన్ అందుకున్నాడు.
టీ బిజినెస్‌లోకి టేస్టీ తేజా
బిగ్‌బాస్‌కు ముందు ఫుడ్ వ్లాగ్స్, ట్రావెలింగ్‌పై వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అలాగే తనకు బాగా పట్టున్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇరానీ నవాబ్స్ టీ అనే పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి బాగానే సంపాదిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు వంటి నగరంలోనూ తన టీ దుకాణాలను ఓపెన్ చేశాడు. విదేశాల్లోనూ తన ఫ్రాంచైజీని విస్తరించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇదంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో కష్టాలు పడ్డాడు తేజ. తాజాగా జబర్దస్త్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన టేస్టీ తేజా తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నాడు.

నా ముందే అలాంటి మాటలు
నా ఫ్రాంచైలలో టీ ధర 20 రూపాయలు. నాకు అమ్మాయిలతో అంత బాగా ఫ్రెండ్‌షిప్ చేసేంత సీన్ లేదు. ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంది నాకు.. నా బాడీ స్ట్రక్చర్, నా కలర్ దానికి కారణం కావొచ్చు. చదువుకునేటప్పుడు క్లాస్‌లో అమ్మాయిల మధ్యలో నడుస్తూ వెళ్తున్నప్పుడు వీడేంటీ ఇలా నడుస్తున్నాడు? వీడు ఇంత లావు ఉన్నాడు అనేవారు. 8 ఏళ్ల పాటు నేను ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు. అందుకే ఇంకా ఇన్‌ఫియారిటీ కాంప్లెక్స్ నాలో ఎక్కువైపోయింది అని టేస్టీ తేజా ఆవేదన వ్యక్తం చేశాడు.
పెళ్లికి అలాంటి కండీషన్
ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు సిక్స్ ప్యాక్ చేయ్ తేజా అంటే ఏం చేస్తావని వర్ష అడగ్గా.. నాకు బిగ్‌బాస్ ప్రియాంక జైన్ ఆఫర్ ఇచ్చిందని తేజ చెప్పాడు. నువ్వు సిక్స్ ప్యాక్ చేయ్.. మనోడిని వదిలేస్తానని చెప్పగా దండం పెట్టేశా. ఆ వెంటనే లైవ్‌లోనే ప్రియాంకకు ఫోన్ చేయగా.. నిన్ను పెళ్లి చేసుకుంటా, శివని పర్మిషన్ అడిగేదేంటీ? వాడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాడని ప్రియాంక ఆన్సర్ ఇచ్చింది. ఎవరితోనైనా లిప్‌లాక్ చేయాలని అనిపిస్తే ఎవరితో చేస్తావని వర్ష అడగ్గా.. నాకు బేసిగ్గా మనసులో ఒక పేరుంది చెబితే బాగుండదేమో వర్ష అని ఒక అమ్మాయి ఉందని పంచ్ విసిరాడు తేజ. కిస్సిక్ టాక్ షోకి వచ్చి యాంకర్‌కు లిప్‌లాక్ పెట్టాడని తెలిస్తే అది బాగుండదని వ్యాఖ్యానించాడు.
ఫుడ్ వ్లాగ్స్‌తో హెల్త్ ప్రాబ్లమ్
యష్మీ గౌడ నీకు ముద్దు పెట్టిందని వర్ష ప్రశ్నించగా.. ముద్దు పెట్టించుకోలేదు, నువ్వు ఫీలైతే నీకు ముద్దు పెడతానని యష్మి చెప్పింది. ఫుడ్ వీడియోస్ చేసేటప్పుడు కడుపులో తిప్పినప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని, వీడియో అవ్వగానే బాత్‌రూమ్‌లోకి పరిగెత్తేవాడిని. ఫుడ్ వీడియోస్ చేయడం వల్ల హెల్త్‌కి మంచిది కాదు.. అన్ని రెస్టారెంట్స్ ఒకేలాంటి ఆయిల్ వాడవు. జనాలు కూడా విపరీతంగా బయటకు వెళ్లి తినొద్దు. నా జీవితంలో అనుకున్నవి చాలా మిస్ అయ్యాయి. పెద్ద ఆపర్చ్యూనిటీ నాకు వచ్చేసిందని ఫిక్స్ అయిపోయా, నీ యవ్వా టేస్టీ తేజా 2.0 అనుకున్నా.. చిన్న మిస్ ఫైర్ అయ్యా, మిస్ అయ్యింది అని తేజా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అతనికి వచ్చిన ఆఫర్ ఏంటీ? యష్మికి తేజాకి గొడవ ఏంటీ? తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటీ? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











