పెళ్లికి ముందే అతనితో అలా.. అమ్మ వల్లే ఒప్పుకున్నా.. బిగ్‌బాస్ నటి బోల్డ్ కామెంట్స్

పెళ్లికి ముందు సహజీవనం అన్నపదం నేడు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సాంప్రదాయవాదులు, తల్లిదండ్రులు ఈ కల్చర్‌ను అస్సలు ఒప్పుకోవడం లేదు. అయితే చదువులు, ఉద్యోగాలతో ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉంటున్న యువతీ, యువకులు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే పెళ్లికి ముందే ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా లివింగ్ ఇన్‌లో ఉంటున్నారు. మన సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న ఈ తరహా విధానాలను భారతీయ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. కానీ యువతలో మెజారిటీ మంది దీనికే ఓటేస్తున్నారు. తాజాగా సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిగ్‌బాస్ నటి తేజస్వి ప్రకాశ్. ఈ వివరాల్లోకి వెళితే..

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారమవుతున్న దేశీ బ్లింగ్ అనే రియాలిటీ షోలో సెలబ్రిటీ ప్రేమ జంట కరణ్ కుంద్రా- తేజస్వి ప్రకాష్ పాల్గొన్నారు. బిగ్‌బాస్ హిందీ 15వ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన వీరిద్దరూ హౌస్‌లోనే ప్రేమలో పడ్డారు. నాటి నుంచి నేటి వరకు పీకల్లోతు ప్రేమాయణంలో మునిగితేలుతోంది ఈ జంట. పంజాబ్‌కు చెందిన కరణ్ కుంద్రా.. 2009లో వచ్చిన కితనీ మొహబ్బత్ హై అనే టెలివిజన్ షోతో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత కితనీ మొహబ్బత్ హై 2, దిల్ హై హో తా హై, యహ రిష్టా క్యా కెహ్లాతా హై, తేరే ఇష్క్ మై ఘయాల్ సీరియల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరిగా నిలిచాడు.

Bigg Boss Fame Tejasswi Prakash Makes Shocking Comments on Live-In Relationship with Karan Kundrra

ఇక తేజస్వి ప్రకాష్ విషయానికి వస్తే.. సౌదీ అరేబియాలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ముంబైలో పెరిగింది. బీటెక్ పట్టభద్రురాలైన తేజస్వి.. 2012లో 2612 అనే షోతో పాపులర్ అయ్యారు. అనంతరం సంస్కార్ ధారోహర్ అప్నాన్ కి, స్వరాగిని జోడేన్ రిస్టాన్ కి సుర్, కామ్ సంగినీ, బిగ్‌బాస్ 15, నాగిన్ 6, సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా తదితర షోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియల్స్‌లో పాటు షోలు, మ్యూజిక్ వీడియోలలో నటించిన తేజస్వీ ప్రకాష్.. పలు హిందీ సినిమాలలోనూ నటించారు.

ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ 15లో కరణ్ కుంద్రాతో ప్రేమలో పడ్డ తేజస్వి.. నాటి నుంచి ఆయనతో రిలేషన్‌లో ఉన్నారు. ఎప్పటి కప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని మీడియాలో వార్తలు రావడం.. తర్వాత గాలి వార్తలుగా మిగలడం జరుగుతోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ తన దేశి బ్లింగ్ షోలో జంటగా హాజరయ్యారు. ఇదే షోలో వారిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. ఇదే షోలో వారిద్దరూ మాట్లాడుతూ.. తేజస్వితో నా ప్రేమకు ఆమె తండ్రి నుంచి ఎలాంటి అభ్యంతరం ఎదురవ్వలేదు. అయితే ఆమె అమ్మగారు కాస్త ఆలోచనలో పడ్డారు. తేజస్విని తాను నమ్మలేను.. ఓసారి ఆలోచించుకోమని చెప్పిందని కరణ్ గుర్తుచేసుకున్నారు.

ఆ వెంటనే తేజస్వి మాట్లాడుతూ.. మీ ఇద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉందని తెలిస్తేనే రిలేషన్‌లో ముందుకు సాగమని మా అమ్మ చెప్పింది. అలాగే కరణ్ జీవితాంతం నీతో ప్రయాణాస్ని సాగించగలడో లేదో చెక్ చేసుకోమంది. అందుకే పెళ్లికి ముందే కరణ్‌తో కొన్నాళ్లు కలిసుండమని అమ్మే చెప్పింది. ఇలాంటివి ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పరు. కానీ మా అమ్మ మాత్రం ఎంతో ముందుచూపు, నమ్మకంతో కరణ్‌తో కొన్నాళ్లు సహజీవనం చేయమని చెప్పింది. ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని నమ్మకం కలిగినప్పుడే పెళ్లి చేసుకోమని చెప్పారని తేజస్వీ ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

కాగా.. ఈ దేశి బ్లింగ్ వెబ్ సిరీస్‌‌లో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, భారతీయ బుల్లితెర స్టార్స్ పాల్గొంటున్నారు. తేజస్వీ ప్రకాష్‌, కరణ్ కుంద్రాలతో పాటు రిజ్వాస్ సజన్, అదెల్ సజన్ అండ్ సనా సజన్, సతీష్ సన్పాల్ అండ్ తబిందా సన్పాల్, దౌతీ ఫరూఖ్- ఐర్యానా కినాఖ్, అలిజయ్ మీర్జా- లైలి మీర్జా, పమీలా సెరెనా, జాన్వీ గౌర్ తదితరులు పాల్గొంటున్నారు. షో మధ్యలో శిల్పా శెట్టి, టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, వివేక్ ఒబెరాయ్, సానియా మీర్జా వంటి సెలబ్రిటీలు గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X