ఆ ముగ్గురు నన్ను వాడుకుని.. అమ్మాయైతే చాలు వెంటాడతారు.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
సినిమాలు, బిగ్‌బాస్‌తో పాపులర్ అయ్యారు హాట్ బ్యూటీ తేజస్వీ మదివాడ. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్‌గా ట్రై చేసినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ దశలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులారిటీ సంపాదించింది. మధ్యలో కొన్ని వెబ్‌సిరీస్, సినిమాలు చేసినా అవి వర్కవుట్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ప్రేమ, రిలేషన్ తదితర అంశాలపై తేజస్వీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే....
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ అటాక్ సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో నటించింది. ఈ దశలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్‌క్రీమ్ మూవీలో హీరోయిన్‌గా నటించింది తేజస్వీ. ఇందులో గ్లామర్ షో చేసినా జనాలు ఈమెను పట్టించుకోలేదు. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా లవర్స్, అనుక్షణం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, కేరింత, జతకలిసే, బాబు బాగా బిజీ, జాంబీ రెడ్డి, కమిట్‌మెంట్ తదితర సినిమాలలో నటించారు. గతేడాది అరుణ్ కుమార్ అనే వెబ్ సిరీస్‌లో నటించి... చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను పలకరించింది.

సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ తేజస్వీ ముందుంది. గతంలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల సమయంలో ఇండస్ట్రీలోని చీకటి కోణాలను, తనకు ఎదురైన సంఘటనలను బయటపెట్టి బాంబు పేల్చింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి జనాలు తిట్టుకుంటున్నారు అంటే అదొక ద్వేషం నుంచి వస్తున్నట్లే. నాలాగా బతకలేక, నాలా మాట్లాడలేక నా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల మీద నాకు జాలి వస్తుంది తప్పించి కోపం రాదు. అలాగని నాకు ప్రేమ కూడా అంతే వస్తుంది. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు నన్ను గుర్తుపడతారు... కానీ టచ్‌లో ఉండేటంత రిలేషన్ లేదు. సీతమ్మ వాకిట్లో మూవీ టైంలో సమంతతో బాగా క్లోజ్‌గా ఉండేదానిని. ప్రతి సినిమాకు కొత్త ఆర్టిస్ట్‌లు వస్తుంటారు, పోతుంటారు అని తేజస్వీ తెలిపారు.
డబ్బులొస్తే వెంటనే ఖర్చు పెట్టేస్తా.. ఇప్పటి వరకు జీరో సేవింగ్స్. పదేళ్లు అద్దె ఇంట్లోనే ఉంటున్నా, కారుకు లోన్ కడుతున్నా. నెలకు నా ఖర్చులకు ఎంత అవసరమో అంత సంపాదిస్తా. అది రాగానే ఇక పనిచేయను. ఫ్యామిలీ, పెళ్లి, పిల్లలు ఉన్న వారికి డబ్బు సంపాదించాలి అనే తపన ఉంటుంది.. అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో నాన్న మందుకు బానిస అయ్యారు. చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. పెళ్లి చేసుకుందామనే ప్రేమిస్తాడు ఎవరైనా. జనాల్ని నా మీద రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వను. వాళ్లకు తిరిగి ఇవ్వాలనే భయంతోనే అలా చేస్తా. నన్ను ప్రేమించి ఐదేళ్ల తర్వాత నువ్వు యాక్టింగ్ మానేయాలి, ఎవరితోనూ మాట్లాడొద్దు అని కండీషన్ పెట్టేవారు అని తేజస్వీ పేర్కొన్నారు.
చిన్నప్పటి నుంచి నన్ను చాలా మంది చీట్ చేశారు. డబ్బు, ప్రేమ విషయంలో ఇలా చాలాసార్లు మోసపోయా. ఇన్ని చేసినా నేను చాలా అమాయకురాలిని. అందరినీ నమ్మేసి అంతా మనోళ్లే అన్నట్లుగా వెళ్లిపోతుంటాను. వాళ్లు నా గురించి మాట్లాడుతుంటే వింటే బాధగా ఉంటుంది. ఏం జరిగినా నన్ను నేనే చూసుకోవాలి. హీరో నవదీప్ వాళ్ల ఫ్యామిలీ నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నన్ను ఒకసారి హెల్ప్ చేసిన వాళ్లని నేను జీవితాంతం మరిచిపోను. నేను ఎవరెవరితో డేట్ చేశానో.. ఎన్నేళ్లు డేట్ చేశానో.. వాళ్ల పేర్లు, ఇతర వివరాలతో నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. నేను ముగ్గురితో గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను.. ఇప్పుడు ఒకరితో రిలేషన్‌లో ఉన్నాను. అతని పేరు కోనార్క్ ... కలిసి వన్ ఇయర్ అవుతోందని తేజస్వీ అన్నారు.
ఎవరితో రిలేషన్‌లో ఉన్నా తొందరపడి అన్ని వివరాలు చెప్పేస్తాను. అది నా రిలేషన్‌షిప్‌లో కౌంట్ అవుతుంది తప్పించి జనాలు నా మనస్తత్వాన్ని అర్ధం చేసుకోకుండా నా క్యారెక్టర్‌ని జడ్జ్ చేస్తారు. నేను అందుకే ఐ లవ్ యూ వెంటనే చెప్పడం లేదు. పెళ్లయితే కానీ చెప్పకూడదని అనుకుంటున్నా. నేను ఇంత పబ్లిక్‌గా చెప్పుకుంటున్నాను.. కానీ కొంతమంది ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అడవిలో జింకలను వేటాడటానికి సింహాలు, పులులు వచ్చినట్లే .. యాక్టింగ్ ఫీల్డ్‌లో ఉన్నవారికి అందంగా ఉన్నా, లేకపోయినా నువ్వు అమ్మాయిగా పుట్టినందుకు కొందరు నిన్ను సంప్రదిస్తారు. నీకేం కావాలి? మాకేం ఇస్తావు? అన్నట్లు డీల్ చేస్తారు అని తేజస్వీ మదివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications










