నాకు అలాంటి సమస్యలు.. ఎన్నో కష్టాలు.. బిగ్‌బాస్ తనూజ మనసులో బాధ..

బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన అమ్మడు, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రేజ్‌తో బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టింది. హౌస్‌లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే తన గేమ్ ప్లాన్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపాడేసింది. ఈ క్రమంలో సీజన్ విజేతగా నిలుస్తారని చాలా మంది భావించారు. చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నప్పటికీ, అభిమానుల దృష్టిలో మాత్రం తనూజే అసలైన విజేత.అయితే.. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న తనూజ చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

బిగ్ బాస్ తేజస్వీ మదివాడ చేస్తున్న కాకమ్మ కథలు మూడో సీజన్‌లో తనుజ పుట్టస్వామి, రీతూ గెస్టులుగా వచ్చారు. ఈ సమయంలో తనుజ జీవితంలో జరిగిన ఎన్నో విషయాల్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ సొసైటీ ఇప్పుడు తనను ఎలా చూస్తోందో చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎన్నడు ఇంటర్వ్యూలకు అటెండ్ గాని ఇంటర్వ్యూకు రావడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తనతో పాటు రీతూ చౌదరి కూడా వచ్చి షోలో హంగామా చేసింది. షో ప్రారంభంలో ఫన్నీగా సాగినా ..మధ్యలో తనుజ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వెల్లడించింది.

Bigg Boss Fame Thanuja Puttaswamy Gets Emotional In Tejaswi Madivada Kaakamma Kathalu S3 Episode 5 Promo

"నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచనే నాకు లేదు. జీవితంలో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. ఒక దశలో నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆసుపత్రికి వెళ్లడానికి కూడా నా వెంట ఎవరూ లేరు. నేనే ఒంటరిగా అంబులెన్స్‌లో వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు సపోర్ట్ చేసే వ్యక్తి కూడా లేడు. నా ఆరోగ్యం ఇంతగా క్షీణించిందనే విషయం కూడా నాకు తెలియదు. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఒక దశలో కుప్పకూలిపోయాను. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. నా ఒంటరి జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొనని చెప్పింది. అదే నేను అందరూ అభినందించే స్థాయికి చేరుకున్నాను'అంటూ తనుజ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక షోలో తేజస్వీ అడిగిన కొన్ని ప్రశ్నలకు తనుజ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 'ఫేమ్ మీద మీ అభిప్రాయం ఏంటి?' అని అడగగా, 'ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. దాని గురించి మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు' అని చెప్పడంతో యాంకర్ ఆశ్చర్యపోయారు. వెంటనే రీతూ చౌదరి సరదాగా "నువ్వు ఈ ప్రపంచంలోనే ఉన్నావా?" అంటూ సెటైర్ వేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఆ తర్వాత 'లవర్ బాయ్ అంటే ఎవరు గుర్తుకు వస్తారు?' అని అడిగిన ప్రశ్నకు కూడా తనుజ సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో రీతూ చౌదరి తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. "లవర్ బాయ్స్ అంటే ఎవరికీ నచ్చుతారు? వాళ్ల పని అంతా తిరగడమే" అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

తర్వాత షోను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు తేజస్వీ రాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. ప్రస్తుతం మీ క్రష్ ఎవరు? అని అడగగా, తనుజ 'వైరా' అని సమాధానం ఇచ్చారు. అలాగే 'షూటింగ్‌కు లేట్ అయితే ఏ కారణాలు చెబుతారు?' అని అడిగితే, "హెల్త్ బాగోలేదు, కళ్ళు తిరిగాయి, కడుపు నొప్పిగా ఉంది అంటూ చాలా కారణాలు చెబుతాం'అంటూ నవ్వులు పంచారు. ఇక ఈ ప్రొమోలో హైలైట్‌గా నిలిచింది ప్రపోజల్ టాస్క్. రీతూ చౌదరిని తన బాయ్‌ఫ్రెండ్‌గా ఊహించుకుని ప్రపోజ్ చేయాలని తేజస్వీ టాస్క్ ఇవ్వగా, తనుజ ఎంతో సరదాగా స్పందించారు.

'నేను ఎప్పుడైనా ఎవరినైనా ప్రపోజ్ చేసే రోజు వస్తుందని అనుకోలేదు. నువ్వు నా జీవితంలోకి వస్తే అది మరింత కలర్‌ఫుల్‌గా మారుతుందని అనుకుంటున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ప్రపోజ్ చేయడంతో హైలెట్ గా మారింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా తనుజ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పిన మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X