వికటించిన ఆ సర్జరీ .. గుర్తుపట్టలేనంత భయంకరంగా స్టార్ హీరోయిన్

అందాన్ని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో ఇటీవలి కాలంలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అవగాహన పెరుగుతోంది. శరీరంలో ఏ భాగం ఆకర్షణీయంగా కనిపించకపోయినా వెంటనే ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ సర్జరీలు చేయించుకోవడానికి వెనుకాడటం లేదు. మారుమూల ప్రాంతాలకు సైతం ఈ తరహా సర్జరీలు అందుబాటులోకి రావడం.. ప్రజల్లో అందంపై స్పృహ పెరగడంతో డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.

ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్న స్టార్స్
సామాన్యుల పరిస్ధితే ఇలా ఉంటే గ్లామర్‌నే పెట్టుబడి పెట్టి కెరీర్‌లో దూసుకెళ్లే స్టార్స్ పరిస్ధితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం ఉన్నంత కాలమే వారి కెరీర్ మూడు పువ్వులు- ఆరుకాయలు అన్నట్లుగా ఉంటుంది. అందుకే అందాన్ని కాపాడుకునే విషయంలో నటీనటులు ఎలాంటి రిస్క్‌కైనా వెనుకాడరు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటివరకు ఎందరో హీరోయిన్లు తమ శరీర భాగాలకు సర్జరీలు చేయించుకున్నారు. మరికొందరు కొవ్వు కూడా కోయించుకున్నారు.

Bigg Boss fame urfi javed surgery gone wrong Here s the details

ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సెలబ్రెటీలు
సర్జరీలు, డైట్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు తమ ప్రాణాలనే కోల్పోగా.. మరికొందరికి సర్జరీలు వికటించి అంద వికారంగా మారుతున్నారు. తాజాగా ఈ కోవలేకే వస్తారు బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్. విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో, హాట్ హాట్ ఫోటోలు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు ఈ ముద్దుగుమ్మ. అందరూ వేసుకునేలా కాకుండా రకరకాల వస్తువులు, డిజైన్లతో డ్రెస్సులు తయారు చేయించుకుని గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు ఉర్ఫీ.

ఫేమస్ అవ్వడానికి జోకులు వేస్తారా
ఏ విషయంపై అయినా, ఏ వేదికపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఉర్ఫీ స్టైల్. కొద్దిరోజుల క్రితం ఇండియాస్ గాట్ లాటెంట్‌ షోకు గెస్ట్‌గా హాజరైన ఉర్ఫీపై ఆ షోలో కంటెస్టెంట్స్ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు, జోక్ చేయడంతో ఆమె సీరియస్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో తన అక్కసు వెళ్లగక్కారు. వ్యూస్ కోసం ఇతరులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని ఉర్ఫీ పేర్కొన్నారు. ఫేమస్ అవ్వడానికి స్టేజ్‌పై ఓ వ్యక్తిని ఎందుకు అవమానిస్తున్నారని ఉర్ఫీ జావెద్ మండిపడ్డారు.

వికటించిన లిప్ సర్జరీ
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఉర్ఫీ జావెద్ ఎప్పటికప్పుడు తన షోలు, సినిమాలు, ఈవెంట్స్‌కి సంబంధించిన వార్తలను అప్‌డేట్ చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఉర్ఫీ ముఖం ఉబ్బిపోయి, పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించాయి. దీంతో నెటిజన్లు, ఆమె అభిమానులు షాక్ అయ్యారు. కొన్నేళ్ల క్రితం ఉర్ఫీ జావెద్ లిప్ సర్జరీ చేయించుకున్నారు. అది ఆ సమయంలోనే వికటించడంతో పెదవుల లుక్ మారిపోయి.. ఫేస్ ఉబ్బిపోయి కనిపించింది. ఆ తర్వాత అవి సరిచేసుకోవడంతో తిరిగి యథాస్థానానికి చేరుకున్నాయి. అయితే లిప్ ఫిల్లర్స్ ఎప్పటికప్పుడు ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ లిప్ ఫిల్లర్లని తాను కరిగించుకున్నానని.. ఎవరూ తనలా చేయొద్దని, అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లాలని ఉర్ఫీ జావెద్ సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

More from Filmibeat

Read more about: bigg boss urfi javed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X