ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ జాక్‌పాట్.. ఆమె నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టీవీ షోలు, యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమ్మడు. ఆ తరువాత బిగ్ బాస్ రియాలిటీ షో పాల్గొని, మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం టెలివిజన్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది. అయితే.. గ్లామర్ ఫోటోలు, వీడియోలు, లైవ్ సెషన్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు విష్ణుప్రియ. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ద్వారా భారీ ఆదాయం పొందుతున్నారు. ఇంతకీ ఈ బిగ్ బాస్ బ్యూటీ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా?

Also Read
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!

ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్.. ఎంతో మంది సెలబ్రిటీలకు అదనపు ఆదాయ వనరుగా మారింది. అభిమానులు నెలవారీగా కొంత అమౌంట్ చెల్లించి, తనకు నచ్చిన వారి ప్రత్యేక కంటెంట్‌ను చూసే అవకాశముంటుంది. దీంతోచాలామంది నటీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ ఫీచర్‌ను వినియోగిస్తున్నారు. తెలుగులో విష్ణుప్రియ,అనన్య నాగళ్ల, అషు రెడ్డి, సిరి హనుమంత్ తదితరులు సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందులో టాప్ లో ఉంది మాత్రం విష్ణు ప్రియనే.

Bigg Boss Fame Vishnu Priya Instagram Subscription Income
Recommended For You
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

ప్రస్తుతం విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 7,460కు చేరింది. ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి నెలకు రూ.390 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆమె మొత్తం ఆదాయం రూ.29,09,400 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది గ్రాస్ ఇన్ కామ్. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ ఫీజులు, ఇతర పన్నులు ఉంటాయి. అవన్నీ కట్టింగ్స్ పోయినా సోషల్ మీడియా ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకుంది.

You May Also Like
OTT This Week: ఓటీటీ వినోదాలు డబుల్.. ఈ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లివే..
OTT This Week: ఓటీటీ వినోదాలు డబుల్.. ఈ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లివే..

ఇదిలా ఉంటే.. ఇటీవల విష్ణుప్రియ పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ కావడానికి పలు వివాదాలే కారణమయ్యాయి. ముఖ్యంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు, లైవ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు వివాదాస్పదంగా మారాయి. 'నా బాడీ కౌంట్ 5' అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అదే సమయంలో ఆమె సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై కూడా పలు విమర్శలు వచ్చాయి. కొందరు విద్యార్థి సంఘాలు, సామాజిక వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, ఆమెపై కేసులు కూడా పెట్టారు.

Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో 'కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?
Cocktail 2 Day 3 Box Office Collections: వీకెండ్ లో 'కాక్‌టెయిల్ 2'దూకుడు.. రష్మిక మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇలా వివాదాలతో విష్ణుప్రియకు పబ్లిసిటీ పెరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌ వ్యవహరం వెలుగులోకి వచ్చిందని సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా వివాదాస్పద అంశాలు వైరల్ అయినప్పుడు ఆ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రజల దృష్టి మరింత పెరుగుతుంది. అలా విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగిందని చెబుతున్నారు. వివాదానికి ముందు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ కౌంట్.. వివాదం తరువాత సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఆ రోజు అర్థరాత్రి సమంత చేసిన పని ఎప్పటికీ మర్చిపోలేను.. రాజ్ నిడిమోరు సోదరి ఎమోషనల్
ఆ రోజు అర్థరాత్రి సమంత చేసిన పని ఎప్పటికీ మర్చిపోలేను.. రాజ్ నిడిమోరు సోదరి ఎమోషనల్

మరోవైపు తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై విష్ణుప్రియ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తప్పుడు వార్తలు, వీడియోలు, పోస్టులు వైరల్ చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారాన్ని సహించబోనని స్పష్టం చేశారు. ఏదిఏమైనా విష్ణుప్రియ ఆదాయంతో పాటు క్రేజ్ కూడా గణనీయంగా పెరిగిందని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X