ఇన్‌స్టా లైవ్‌లో రెచ్చిపోయిన విష్ణుప్రియ.. 'నా బాడీ కౌంట్ 5' అంటూ ఓపెన్ గా..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టెలివిజన్ షోలు, యాంకరింగ్ కార్యక్రమాలతో మంచి గుర్తింపు సంపాదించిన ఈ బ్యూటీ.. తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ షోలు, యాంకరింగ్ కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది విష్ణుప్రియ. ఈ అమ్మడు తరచూ గ్లామర్ ఫోటోలు, వీడియోలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో గ్లామర్ షో చేస్తూ. తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
విష్ణుప్రియ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తన అభిమానులకు, తన ఫాలోవర్లకు ప్రత్యేక కంటెంట్ అందిస్తుందట. దీంతో ఆమె స్పెషల్ కంటెంట్ కోసం అభిమానులు తెగ ఎగబడుతున్నారట. అలాగే.. ఈ సబ్ స్క్రిప్షన్ పేరుతో భారీగా సంపాదిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే.. ఈ సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌పై గతంలో వివాదం కూడా చెలరేగింది. కొన్ని విద్యార్థి సంఘాలు ఆమె సోషల్ మీడియా కంటెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. యువతను తప్పుదోవ పట్టించే విధంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

అయితే ఈ వివాదం విష్ణుప్రియకు నష్టంకంటే లాభమే చేకూర్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు తర్వాత అప్పటి వరకూ గుట్టుగా ఉన్నా ఈ వ్యవహరం బహిర్గతం అయిపోయింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్లపై మరింత దృష్టి పడటంతో ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందట. దీంతో అభిమానులతో మరింత దగ్గరయ్యేందుకు, మరింత మందిని ఆకర్షించడానికి ఆమె తరచూ లైవ్ సెషన్లు నిర్వహిస్తోందట.
ఇదే క్రమంలో తాజాగా తన సబ్‌స్క్రైబర్లతో నిర్వహించిన ఓ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో విష్ణుప్రియ చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సంకోచం లేకుండా సమాధానాలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. లైవ్‌లో పాల్గొన్న ఓ ఫాలోవర్ "మీ బాడీ కౌంట్ ఎంత?" అని ప్రశ్నించగా.. విష్ణుప్రియ ఎలాంటి సందేహం లేకుండా స్పందించింది. "నా బాడీ కౌంట్ 5. నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెబుతున్నాను" అంటూ సమాధానం ఇచ్చింది.
ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. అయితే 'బాడీ కౌంట్' అనే పదానికి వేర్వేరు అర్థాలు ఉండే అవకాశం ఉండటంతో, విష్ణుప్రియ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో కూడా పలు విషయాలపై విష్ణుప్రియ నేరుగా స్పందించి వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ ట్రెండింగ్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications



