ఇండస్ట్రీలో అలా తొక్కేశారు... 500 కోసం ప్లేట్లు కడిగా.. బిగ్‌బాస్ నటుడు ఎమోషనల్

చిత్ర పరిశ్రమలో జర్నీ అంత తేలికకాదు. ఇక్కడ పూలు పడిన చోటే.. రాళ్లు పడతాయి. మన దగ్గర సాయం తీసుకున్న వాళ్లే.. అవసరం కోసం వెళ్తే ముఖం చాటేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపి తారాపథంలో వెలుగొందిన వారు చివరి రోజుల్లో నరకయాతన అనుభవించారు. చేతికి ఎముక లేకుండా దానం చేసిన వారు చివరి రోజుల్లో తిండి గింజలు లేక పస్తులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. సక్సెస్‌ని చూసిన వాళ్లే పాతాళానికి పడిపోయారు. తాజాగా తన జీవితంలో పడిన ఇబ్బందులపై బిగ్‌బా‌స్ నటుడు ఎమోషనల్ అయ్యారు.

బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యారు విశ్వ ఆకుల. అంతకుముందే పలు సినిమాలు, సీరియల్స్‌లోనూ ఆయన నటించారు. విద్యార్ధి, సోగ్గాడు, జోష్, పడేశావే తదితర సినిమాల్లో నటించిన విశ్వకు.. తెలుగు బుల్లితెర నుంచి ఆహ్వానం అందింది. యువ, సరదాగా కాసేపు, గంగతో రాంబాబు, గంగ అండ్ మంగ సీరియల్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. 2021లో బిగ్‌బాస్ తెలుగు 5లో కంటెస్టెంట్‌గా అవకాశం తెచ్చుకున్న విశ్వ.. తన బాడీ బిల్డింగ్ స్కిల్స్‌తో ఆట తీరు, వ్యక్తిత్వంతో కుర్రాళ్లకు బాగా దగ్గరయ్యారు. బిగ్‌బాస్‌లో 56 రోజుల పాటు ఉన్న ఆయనకు మంచి ఫేమ్ దక్కింది. ఆ తర్వాత తెరకు దూరమై.. విశ్వ ఫిట్‌నెస్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి ఫిట్‌నెస్, డైట్ తదితర వీడియోలు అప్‌లోడ్ చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవించిన కష్టాలపై చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

Bigg Boss Fame Vishwa Akula Gets Emotional About Life Struggles and Personal Loss

సీసీఎల్‌లో నా ఆటతీరుకు కిచ్చా సుదీప్, సునీల్ శెట్టి లాంటి వాళ్లు ఫిదా అయిపోయారు. సరిగా పీఆర్ చేసుకుని ఉంటే ఇండియాలో ఉన్న అన్ని ఇండస్ట్రీలు కవర్ చేసి 100 సినిమాలు చేసేవాడిని. నా అంతట నేనే మిస్ చేసుకున్నాను. ఈసీజీ రిపోర్ట్ మాదిరిగానే నా జీవితం ఎత్తుపల్లాలతోనే సాగింది. బాగా దగ్గరివాళ్లే నన్ను తొక్కేశారు... పైకి వస్తున్నామని అసూయతో నాకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేశారు. వాళ్లంతా ఇండస్ట్రీ వాళ్లు కాదు.. బయటివాళ్లే. ఆ టైంలో నా తమ్ముడిని కోల్పోయా.. నా తమ్ముడి సంపాదనతో బతికా. ఆరు నెలలు వాడే ఇంటిని నడిపించాడు, నాన్న చనిపోవడంతో రోడ్డు మీదకి వచ్చేశాం. బతుకుతెరువు కోసం ఖైరతాబాద్ చౌరస్తాలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం. వర్కర్స్ లేకపోతే నేనే ప్లేట్స్ కడిగేవాడిని అని విశ్వ గుర్తుచేసుకున్నారు.

ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో గ్యాస్ సిలిండర్స్ ఎలా వెలిగించాలో తెలియదు. ఒకసారి కంటిరెప్పలు కూడా కాలిపోతాయి, రుమాలి రోటీలు చేస్తూ చేతులు కాల్చుకున్నా. ఖైరతాబాద్ సెంటర్‌లో పెద్ద మనుషులు నా కాలర్ పట్టుకోవడంతో నా తమ్ముడు వాళ్లతో గొడవ పడ్డాడు. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయాం.. కానీ ఇదే బతుకుదెరువని ఏదైతే అది అయ్యిందని ఓపెన్ చేశాం. ఓనర్ కూడా షాప్ ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్పాడు. ఫస్ట్ నా రెంట్ 2200 రూపాయలే.. గొడవ తర్వాత డైలీ 500 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశాడని విశ్వ చెప్పారు.

అప్పట్లో డైలీ 500 అంటే చాలా ఎక్కువ.. నెలకు 15 వేలు పైనే అయ్యేది. వేరే వాళ్లు వచ్చి గొడవ చేయడం.. షాప్ మూసేయడం, మేం మళ్లీ ఓపెన్ చేయడం జరిగేది. కానీ ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వల్లే మా ఇల్లు గడుస్తోంది... 10 మంది బతుకుతున్నారు అని ఆలోచించి ఏం జరిగినా ముందుకు వెళ్లాం. ఈ జర్నీలో నా తమ్ముడిని కోల్పోవడం జీవితంలో పెద్ద లోటు. బైక్‌పై వెళ్తుంటే వాడు లేడే అనే బాధ వెంటాడుతోంది. నాకంటే కూడా నా భార్య అంటే తమ్ముడికి చాలా ఇష్టం. ఏం కావాలన్నా తమ్ముడే చూసుకునేవాడు. వాళ్లిద్దరిదీ తల్లీ కొడుకుల రిలేషన్. లైఫ్‌లో ఏదైనా తిరిగి సంపాదించుకోవచ్చు.. కానీ నీ హెల్త్ మాత్రం రిటర్న్ తెచ్చుకోలేవు. దేవుడిచ్చిన పెద్ద గిఫ్ట్ నీ శరీరమే. మన బాడీ కనుక సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేమని విశ్వ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: bigg boss vishwa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X