పెళ్లి కూతురిగా బిగ్‌బాస్ బ్యూటీ .. హల్దీ వీడియోతో షాకిచ్చిన యష్మీ గౌడ!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రేమలో మునిగి తేలడమో , లేదంటే పెళ్లి పీటలెక్కడమో చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒక సెలబ్రెటీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు బుల్లితెర నటులు కూడా పెళ్లీ పీటలెక్కుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ శుభవార్త చెబుతారోనని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి హల్దీ వీడియోతో సైలెంట్‌గా షాకిచ్చారు.

కర్ణాటకకు చెందిన యష్మీ గౌడ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు వచ్చారు. మిస్ మైసూర్, మిస్ ఫోటోజెనిక్ ఫేస్ టైటిల్స్‌ని అందుకుంది. సరదాగా ఓ రోజున అడిషన్‌కు వెళ్లిన యష్మీకి అనుకోకుండా విద్యా వినాయక అనే ధారావాహికలో అవకాశం దక్కింది. ఈ సీరియల్‌లో తన అందం, క్యూట్ లుక్స్, నటనతో ఆకట్టుకున్న యష్మీ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కన్నడలో పలు సీరియల్స్‌లో నటించిన ఆమెకు తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. తొలుత ఈటీవీలో ప్రసారమైన స్వాతి చినుకులులో నటించిన యష్మీ గౌడ.. ఆ తర్వాత నాగభైరవిలో లీడ్ రోల్‌లో నటించింది.

Bigg Boss Fame Yashmi Gowda haldi and mangala snanam video goes viral

ఇక స్టార్ మాలో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి సీరియల్ యష్మీగౌడ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ముకుందగా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించిన ఆమె బాగా పాపులర్ అయ్యింది. బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఈ సీరియల్‌కు ఇటీవలే ఎండ్ కార్డ్ పడింది. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు 8లో అవకాశం దక్కించుకుంది. టాప్ కంటెస్టెంట్‌గా , బిగ్‌‌బాస్ దత్తపుత్రికగా జనాల చేత అనిపించుకున్న యష్మీ గౌడ తొలుత బాగానే ఆడినప్పటికీ ఆ తర్వాత ట్రాక్ తప్పింది. నాగార్జున గారు యష్మీని ఎలిమినేట్ చేసేయండి అంటూ జనాలు కామెంట్స్ చేసే వరకు వచ్చింది.

హౌస్‌లో ఉన్నప్పుడు గౌతమ్‌తో ప్రేమాయణం సాగించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత నిఖిల్‌ను ట్రై చేసింది. ఏకంగా 12 వారాల పాటు హౌస్‌లో ఉన్న యష్మీగౌడ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. తన వరస్ట్ బిహేవియర్‌తో ఏకంగా మరో కన్నడ బ్యూటీ శోభాశెట్టిని గుర్తుకు తెచ్చింది. 30కి అడుగుపెడుతున్న యష్మీ గౌడను పెళ్లెప్పుడు అంటూ అభిమానులు పలుమార్లు ప్రశ్నించారు. కానీ ఆమె మాత్రం నవ్వి ఊరుకున్నారు. బిగ్‌బాస్ తర్వాత యష్మీకి బాగా క్రేజ్ రావడంతో ఆమెకు సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ పెరిగారు.

Bigg Boss Fame Yashmi Gowda haldi and mangala snanam video goes viral

ఈ నేపథ్యంలో యష్మీగౌడకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికూతురిలా ముస్తాబైన యష్మీకి ముత్తయిదువులు గంధం రాసి , మంగళ స్నానం చేయించినట్లుగా ఆ వీడియో ఉంది. ఇది చూసిన నెటిజన్లు యష్మీగౌడకి పెళ్లయ్యిందా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది నిజం పెళ్లి కాదని, ఏదో సీరియల్ కోసం చేసిన చిత్రీకరణ అని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా యష్మీగౌడ త్వరగా పెళ్లి పీటలు ఎక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss yashmi gowda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X