Bigg Boss Winner: బిగ్ బాస్ అసలు విజేత శ్రీహాన్.. నాగార్జున ఆఫర్ కు టెంప్ట్ అయి కోల్పోయిన టైటిల్!
తెలుగు టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్‌ను రాబట్టడంతో పాటు నేషనల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. తాజాగా డిసెంబర్ 18న ఆరో సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో సింగర్ రేవంత్ విన్నర్ గా ప్రకటించబడ్డాడు. అయితే చివర్లో నాగార్జున ఇచ్చిన ఆఫర్ కు టెంప్ట్ అయిన శ్రీహాన్ తోపాటు టైటిల్ విన్నర్ రేవంత్ ఎంత గెలుచుకున్నాడనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బ్రదర్ పేరుతో షో..
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి సైతం తీసుకొచ్చారు. ఇక తెలుగులో 2017లో అనేక అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ రియాలిటీ షో వరుస సీజన్లతో దూసుకుపోతూ ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఇంకొక్క రోజులో పూర్తి కానుంది.

16 మంది బయటకు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోకి వచ్చిన 21 మందిలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, ఫైమా, ఇనయా సుల్తానాతోపాటు మిడ్ వీక్ ఎవిక్షన్ ప్రకియలో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయింది. ఇలా హౌజ్ నుంచి 16 మంది వెళ్లిపోయారు.

ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ టాప్ 5లోకి రేవంత్, రోహిత్, శ్రీహాన్, కీర్తి భట్, ఆదిరెడ్డి వెళ్లారు. డిసెంబర్ 18 ఆదివారం నిర్వహించి గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ చివరిగా టైటిల్ విజేతగా సింగర్ రేవంత్ కు ట్రోఫి అందజేశారు. ముందుగా బిగ్ బాస్ హౌజ్ లోకి హీరో నిఖిల్ వెళ్లి.. రోహిత్ ను ఎలిమినేట్ చేసి తీసుకొచ్చాడు. అనంతరం ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయి ఇంటి బయటకు వెళ్లారు.

రూ. 30 లక్షల ఆఫర్..
ఇక చివరిగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన రేవంత్, శ్రీహాన్ నిలిచారు. వీరిద్దరికి గోల్డెన్ బ్రీఫ్ కేస్ ఆఫర్ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. ముందుగా అందులో రూ. 25 లక్షలు ఉన్నాయని చెప్పాడు. అయితే ఆ డబ్బు తీసుకునేందుకు ఎవరు అంగీకరించలేదు. తర్వాత ఆ మనీని పెంచుతూ రూ. 30 లక్షలు చేశాడు నాగార్జున. ఆ డబ్బు తీసుకునేందుకు కొంచెం టైమ్ ఇచ్చారు నాగార్జున. అయినా కూడా రూ. 30 లక్షలు తీసుకునేందుకు రేవంత్, శ్రీహాన్ అంగీకరించలేదు.

ఆఫర్ కు టెంప్ట్ అయిన శ్రీహాన్..
తర్వాత బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి రూ. 40 లక్షలు కట్ చేస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున. అంటే రూ. 40 లక్షల టెంప్టింగ్ ఆఫర్ ను వారిద్దరి ముందు ఉంచారు నాగార్జున. తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ ఒపినీయన్ తీసుకోమన్నారు. శ్రీహాన్ తల్లిదండ్రులు ఆ ఆఫర్ ను తీసుకోమ్మని చెప్పడంతో శ్రీహాన్ అంగీకరించాడు. దీంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి రూ. 40 లక్షలు అందుకున్నాడు శ్రీహాన్.

అసలు విజేత శ్రీహాన్..
ఇకి టైటిల్ విన్నర్ అయిన రేవంత్ కు రూ. 10 లక్షలతో పాటు 605 స్క్వైర్ యార్డ్స్ గల సువర్ణ భూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ సాకేత్ స్థలాన్ని అందుకోనున్నాడు. దీని ఖరీదు సుమారు రూ. 25 లక్షలు. అయితే ఇప్పుడు అది పెరిగి రూ. 30 లక్షలు అయినట్లుగా తెలిపారు. అంతేకాకుండా మారుతీ సుజుకీ బ్రేజా కారును కూడా రేవంత్ గిఫ్ట్ గా పొందాడు. ఇదిలా ఉంటే అతి తక్కువ మార్జిన్ ఓటింగ్ తో టాప్ 1లో శ్రీహాన్, టాప్ 2 రేవంత్ ఉన్నాడు. అంటే.. ఆ రూ. 40 లక్షల బ్రీఫ్ కేస్ తీసుకోకుంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ అసలు విజేత శ్రీహాన్ అన్నమాట. అంటే రూ. 40 లక్షలు తీసుకుని టైటిల్ విన్నర్ ను శ్రీహాన్ కోల్పోయాడు.


Click it and Unblock the Notifications











