Bigg Boss: లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు.. ఐదుగురిలో నలుగురు ఎలిమినేట్

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఆడియెన్స్ దీనికి ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. ఫలితంగా తెలుగులో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, అప్పుడే ఒక వారం పూర్తవడంతో పాటుగా ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నడుస్తోన్న తీరు.. ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ఓ సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అసలేం జరుగుతోంది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ఒక దానికి మించి మరొకటి సూపర్ హిట్

ఒక దానికి మించి మరొకటి సూపర్ హిట్


ఎన్నో అనుమానాల మధ్య తెలుగులోకి వచ్చింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఎంకరేజ్ చేస్తారా? ఇక్కడ ఇది క్లిక్ అవుతుందా? ఇలా అనుకుంటోన్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. అదే సమయంలో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే గత సీజన్‌లో ఏకంగా 18 పైచిలుకు రేటింగ్‌తో రికార్డు నమోదైంది. తద్వారా జాతీయ స్థాయిలో తెలుగు బిగ్ బాస్ హైలైట్ అయిపోయింది.

 నాలుగు సీజన్లకు ముగ్గురు స్టార్ హీరోలు

నాలుగు సీజన్లకు ముగ్గురు స్టార్ హీరోలు

తెలుగులో బిగ్ బాస్ షో సూపర్ హిట్ అవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమయంలో దీన్ని ఎంతో చక్కగా నడిపించిన స్టార్ హీరోల పాత్ర కూడా ఉందనే చెప్పాలి. మొదటి సీజన్‌లో నందమూరి చిన్నోడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. తద్వారా ఈ షోకు గట్టి పునాదులు వేశాడు. రెండో సీజన్‌లో నాని తనదైన శైలి హోస్టింగ్‌తో మెప్పించాడు. ఇక, మూడు, నాలుగు సీజన్లను అక్కినేని నాగార్జున మరింత సక్సెస్ చేశాడు. ఈ రెండు సీజన్లకే రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చిందన్న విషయం తెలిసిందే.

సందేహాల నడుమ మొదలైన ఐదో సీజన్

సందేహాల నడుమ మొదలైన ఐదో సీజన్

ఇండియాలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఈ షో కోసం వాళ్లంతా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య చాలా వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, వాటిని పటాపంచలు చేస్తూ సెప్టెంబర్ 5 ఆదివారం గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ను మొదలు పెట్టేశారు. అక్కినేని నాగార్జునే దీనిని కూడా హోస్టు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

ఇప్పుడు మరో రికార్డు.. ఒకేసారి అంతలా

ఇప్పుడు మరో రికార్డు.. ఒకేసారి అంతలా

బిగ్ బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఈ సారి నిర్వహకులు మంచి స్ట్రాటజీతో వచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం ఈ సీజన్‌కు ఎంపికైన వారిలో ఎక్కువ మంది ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే ఉన్నారు. ఇక, ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, జబర్ధస్త్ ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.

 ఎంతో ఆసక్తికరంగా ముగిసిన ఫస్ట్ వారం

ఎంతో ఆసక్తికరంగా ముగిసిన ఫస్ట్ వారం

బిగ్ బాస్ ఐదో సీజన్ మొదటి వారం ఎన్నో రకాల టాస్కులతో సందడిగా సాగింది. నామినేషన్స్ టాస్కులో ఆరుగురు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. ఇక, ఇందులో జరిగిన మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కులో సిరి హన్మంత్ విజయం సాధించింది. ఇక, ఈ వారం మొత్తం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కంటెస్టెంట్‌గా విశ్వ ఎంపికయ్యాడు. చెత్త ఆటగాడిగా జస్వంత్ పడాల పేరు రావడంతో అతడు జైలు పాలయ్యాడు. ఇక, ఈ వారం పలువురి మధ్య గొడవలు కూడా జరిగాయి. అలాగే, వినాయక చవితి పండుగ సందర్భంగా హౌస్‌లో కంటెస్టెంట్లు అందరూ పూజలు నిర్వహించారు.

మొదటి వారం హౌస్‌ నుంచి సరయు ఔట్

మొదటి వారం హౌస్‌ నుంచి సరయు ఔట్

బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. ఎంతో ఆసక్తికరంగా ఎన్నో గొడవల మధ్య ఇది ప్రతి సోమవారం జరుగుతుంది. ఇక, ఐదో సీజన్‌కు సంబంధించి మొదటి వారం నామినేషన్స్ టాస్క్ సైతం ఎంతో రచ్చ రచ్చగా జరిగింది. ఇందులో ఈ వారానికి యాంకర్ రవి, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు నామినేట్ అయ్యారు. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై ఆరంభం నుంచీ ఒకే రకమైన టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయింది.

Recommended Video

Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు

లేడీ కంటెస్టెంట్‌లకు దెబ్బ మీద దెబ్బలు

తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్లు విజేతలుగా నిలవలేదు. అంతేకాదు, నిన్నటి ఎపిసోడ్ వరకూ మొత్తం ఐదు సీజన్లలో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే.. ఐదుగురిలో నలుగురు ఆడవాళ్లే బయటకు వెళ్లిపోయారు. మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, నాలుగో సీజన్‌లో సూర్య కిరణ్, ఇప్పుడు ఐదో సీజన్‌లో సరయు రామ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా ఆడవాళ్లకు దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X