అభిజీత్‌కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్: ఆ తప్పు వల్ల ఏకంగా ఇంటి నుంచే పంపేశాడు!

సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలతో బిగ్ బాస్ షో రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఫైనల్‌ చేరువ అవుతున్న కొద్దీ షోలో ఎన్నో మలుపులు జరుగుతున్నాయి. దీంతో చివరి దశలో మరింత ఆదరణతో దూసుకుపోతోందీ నాలుగో సీజన్. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా, ఫినాలేలో అడుగు పెట్టే ఐదుగురు ఎవరన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజారిటీ ప్రేక్షకులు మాత్రం అభిజీత్ ఈ సీజన్ విన్నర్ అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని హౌస్‌ నుంచి పంపించి భారీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. వివరాల్లోకి వెళ్తే..

 ఎవరి నోట విన్నా అతడి పేరే

ఎవరి నోట విన్నా అతడి పేరే

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభంలో నోయల్ సీన్ కానీ, లాస్య కానీ ఈ సారి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వాళ్లంతా మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో అందరి చూపు అభిజీత్‌పై పడింది. దీంతో ప్రేక్షకులంతా అతడే గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

 మైండ్ గేమ్‌లతో పెరిగిన క్రేజ్

మైండ్ గేమ్‌లతో పెరిగిన క్రేజ్

బిగ్ బాస్ హౌస్‌లో మైండ్ గేమ్ ఆడే వాళ్లు నెగ్గుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిజికల్ టాస్కులు ఆడేటప్పుడు కూడా స్మార్ట్ గేమ్ ఆడే వాళ్లు గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సరిగ్గా ఇదే ఫాలో అవుతున్నాడు అభిజీత్. శ్రమ పడకుండా బుర్రకు పని చెబుతూ సక్సెస్ అవుతున్నాడు. ఫలితంగా కొన్ని టాస్కుల్లో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా క్రేజ్ పెంచుకున్నాడు.

 లవ్ ట్రాకులతో హాట్ టాపిక్

లవ్ ట్రాకులతో హాట్ టాపిక్

హౌస్‌లోకి అడుగు పెట్టిన సమయంలోనే అభిజీత్.. మోనాల్ గజ్జర్‌తో ట్రాక్ మొదలు పెట్టాడు. అదే సమయంలో ఆమె నువ్వంటే నాకిష్టం అంటూ అతడికి చెప్పడంతో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత మోనాల్.. అఖిల్ సార్థక్‌ వైపు తిరిగిపోవడంతో అభిజీత్.. దేత్తడి హారికతో స్నేహంగా ఉంటున్నాడు. ఇలా ట్రాకుల గోలతో అతడు బాగా హాట్ టాపిక్ అయిపోయాడు.

 అందులో మాత్రం విమర్శలే

అందులో మాత్రం విమర్శలే

అభిజీత్‌కు ప్లస్ అయిన మైండ్ గేమ్.. మైనస్‌గా కూడా మారింది. దీనికి కారణం ఫిజికల్ టాస్కుల సమయంలో పోరాడలేక చేతులెత్తేస్తాడన్న టాక్ రావడమే. ఇదే కారణంతో అతడిని చాలా మంది నామినేట్ కూడా చేశారు. అంతేకాదు, ఇటీవల జరిగిన దెయ్యం టాస్కులో అభిజీత్ వైఖరిపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో నాగార్జున కూడా అతడిని మందలించిన విషయం తెలిసిందే.

 అభిజీత్‌కు మరో భారీ షాక్

అభిజీత్‌కు మరో భారీ షాక్

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ జరుగుతోన్న సంగతి విధితమే. ఇందులో మొదటి రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అతడు.. రెండో రౌండ్‌లో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఫలితంగా ఆ టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. ఇక, ప్రస్తుతం జరుగుతోన్న మూడో రౌండ్‌కు సంచాలకుడిగా ఉన్న అభిజీత్‌కు బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
 ఏకంగా ఇంటి నుంచే పంపి

ఏకంగా ఇంటి నుంచే పంపి

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభిజీత్‌ను ఓ విషయంలో బిగ్ బాస్ మందలించాడట. అంతేకాదు, అతడిని హౌస్‌ నుంచి బయటకు పంపి జైల్‌లో పెట్టినట్లు తెలిసింది. ఓ తప్పు చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రేస్ టు ఫినాలే టాస్కులో సంచాలకుడిగా విఫలం అయ్యాడా? లేక మరేదైనా టాస్కులో ఓడిపోయాడా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X