Bigg Boss Telugu 7: ముద్దుబిడ్డ చేసిన పనికి కంటెస్టెంట్లందరికీ పనిష్మెంట్.. ఏం చేయాలో చెప్పి షాకిచ్చిన బిగ్‌బా
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఇంతకాలం అద్భుతమైన టాస్క్ లు ఇస్తూ అందరినీ అలరించడంలో సఫలం అయ్యారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. ముఖ్యంగా షో అయిపోయేందుకు వస్తున్నా కొద్దీ మరింత అద్భుతంగా ఉంటోంది. ప్రతిరోజు వచ్చే ఒక్క ఎపిసోడ్ ను కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. రాత్రి 9 అయిందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అంతా టీవీల ముందు వాలిపోతున్నారు.
అయితే మొదటి వారం నుంచి తమకు నచ్చిన వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తున్న వస్తున్న బిగ్ బాస్.. మిగతా వాళ్లకు షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు. చుక్క బ్యాచ్, స్టార్ మా బ్యాచ్, సీరియల్ బ్యాచ్ వాళ్లు అయిన శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్, అంబటి అర్జున్ లకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే షో ప్రారంభం అయినప్పటి నుంచి అంతా అమర్ దీప్ యే విన్ అవుతాడని అనుకున్నారు. కానీ ఆయన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో గొడవ పెట్టుకోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. విజేతగా నిలుస్తాడు అనుకున్న అమర్ దీప్ టాప్ 5లోకి కూడా రారని తెలిసిపోయింది.

ఇక ఆ తర్వాత నుంచి సీరియల్ బ్యాచ్ వాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వారికి సపోర్టివ్ గా బిగ్ బాస్ గేమ్ ప్లే చేస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. శోభాశెట్టిని కాపాడుకోవడంతో పాటు ప్రియాంక జైన్, అమర్ దీప్ లను టాప్ 5లోకి తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున ఎత్తులు వేశారని రోజు షో చూసే వాళ్లే చెబుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. బిగ్ బాస్ ముద్దుబిడ్డ చేసిన తప్పుకు ఇంట్లోని వాళ్లందరికీ బిగ్ బాస్ షాకిచ్చాడు. ఈరోజుటి ప్రోమో చూస్తే ఆ విషయం అర్థం అయిపోతుంది.
ముఖ్యంగా బిగ్ బాస్ ముద్దుబిడ్డ అయిన శోభా శెట్టి కాస్త ఓవర్ చేసింది. బిగ్ బాస్ టికెట్ టు ఫినాలేలో భాగంగా ఓ టాస్క్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అంబటి అర్జున్, అమర్ దీప్ లు ఆ గేమ్ ఆడారు. ఈ గేమ్ పూర్తి అయిన తర్వాత శోభా శెట్టి ఆ గేమ్ ఆడింది. దీనికి సీరియస్ అయిన బిగ్ బాస్.. శోభా శెట్టి మీరు చేసిన తప్పుకు గాను శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వివరించారు. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలిచారు. ఆపై అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టిన బిగ్ బాస్.. బిగ్ షాకిచ్చారు.

శోభా శెట్టి చేసిన తప్పుకు గాను హౌస్ మేట్స్ అంతా శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. అంతా చాలా కోపంగా శోభాను చూస్తుండగానే... ఆమె ఏడుపు ప్రారంభించింది. ఇంతలోనే బిగ్ బాస్... శిక్ష గురించి చెబుతూ.. అందరూ ఒక గంట పాటు పడుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీంతో అంతా షాకయ్యారు. పనిష్మెంట్ అని చెప్పి గంట సేపు రెస్ట్ తీసుకోవాలని.. లైట్లు కూడా ఆర్పేస్తామనగా.. హాయిగా వెళ్లి అంతా పడుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











