కెప్టెన్‌కు కోలుకోలేని షాకిచ్చిన బిగ్ బాస్.. ఆ బట్టలు వేసుకోవద్దన్న బాబా.. వరుణ్‌పై దాడి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 41 Highlights || Filmibeat Telugu

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. బుధ, గురువారం రెండు రోజులూ చిరాకు తెప్పించిన ఈ షో.. శుక్రవారం మాత్రం కొంత ఆసక్తికరంగానే సాగింది. దీనికి కారణం ఈ ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ జరగడమే. ముగ్గురు కంటెస్టెంట్లు పోటీ పడిన ఈ టాస్క్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో గెలిచిన కంటెస్టెంట్‌కు వెంటనే బిగ్ బాస్ షాకిచ్చాడు. వివరాల్లోకి వెళితే...

 బోర్ కొట్టించిన వీక్లీ టాస్క్

బోర్ కొట్టించిన వీక్లీ టాస్క్

దాదాపు రెండు రోజుల పాటు సాగిన వీక్లీ టాస్క్ బోర్ కొట్టించింది. ఈ రెండు రోజులు బిగ్ బాస్ వీక్షకులు నరకయాతన అనుభవించారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో గతంలో మాదిరిగా ఈ సారి టాస్క్‌లు ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతేకాదు, ఈ టాస్క్‌లో రొమాన్స్ కూడా కొంత ఎక్కువగానే కనిపించిందన్న కామెంట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో సరికొత్త టాస్కులు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు.

ఆ బట్టలు వేసుకోవద్దన్న బాబా

ఆ బట్టలు వేసుకోవద్దన్న బాబా

కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి తాను కెప్టెన్ అయితే సరికొత్త రూల్స్ పెడతానని బాబా భాస్కర్ అన్నారు. ఇకపై, ఆడవాళ్లు షాట్స్ వేసుకోని తిరగొద్దని నిబంధన పెడతానని చెప్పారు. అంతేకాదు, అలీ రేజా బాత్ రూమ్ నుంచి బయటకు వచ్చే సమయంలో బట్టలు వేసుకుని రావాలని, లేకుంటే బెడ్ షీట్ చుట్టుకుని తిరగాలని చెప్పాడు. దీంతో కొద్దిసేపు దీనిపై హౌస్‌లో చర్చ జరిగింది

మట్టిలో ఉక్కు మనిషి

మట్టిలో ఉక్కు మనిషి

వీక్లీ టాస్క్ ముగిసిన తర్వాత ఎవరు ముగ్గురు కంటెస్టెంట్లు మంచిగా ఆడారో వాళ్లను కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేస్తారు. వారు వారం రోజుల పాటు కెప్టెన్‌గా కొనసాగడానికి పోటీ పడతారు. ఇందులో భాగంగా బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్ సింప్లీగంజ్‌లు పోటీ పడ్డారు. ఈ టాస్క్ కోసం ‘మట్టిలో ఉక్కు మనిషి' అనే సరికొత్త పోటీని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ముగ్గురు పోటీ దారులను కలిపి కట్టేసి బురదలోకి దింపారు. అందులో ఉన్న బాల్స్‌ను ఒక్కొక్కరికి కేటాయించిన బాస్కెట్‌లో వేయాలి. ఇలా ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్లే కెప్టెన్.

రెండోసారి కెప్టెన్ అయిన వరుణ్

రెండోసారి కెప్టెన్ అయిన వరుణ్

ఈ పోటీ ఫిజికల్ టాస్క్ కావడంతో వరుణ్ సందేశ్ మిగిలిన వారితో పోటీ పడలేడని చాలా మంది అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అతడే అందరి కంటే ఎక్కువ బాల్స్ వేసి కెప్టెన్‌గా గెలిచాడు. అందరూ కలిసి కట్టుగా ముగ్గురు పోటీ దారులనూ ప్రోత్సహించడంతో ఎటువంటి గొడవలు జరగకుండా ఈ టాస్క్ ముగిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ టాస్క్‌కు సంచాలకులుగా హిమజను నియమించారు బిగ్ బాస్.

కెప్టెన్‌గా గెలిచిన సంతోషం లేకుండానే...

కెప్టెన్‌గా గెలిచిన సంతోషం లేకుండానే...

ఈవారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘రంగుపడుద్ది' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వరుణ్ ఓ చక్రం ఆకారంలో ఉన్న దానికి కట్టేసి రంగుబాల్స్‌‌తో కొట్టమని.. అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటమ్‌కి తగిలితే ఆ ఐటమ్ లగ్జరీ బడ్జెట్‌గా వస్తుందని బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో వరుణ్‌ని బాల్స్‌తో వీరబాదుడు బాదారు కంటెస్టెంట్స్. అయితే, వితికది మాత్రమే ఐటమ్‌కు తగలగా.. మిగిలిన వారందరూ విఫలం అయ్యారు. ఇక, బాబా భాస్కర్ విసిరినది వెళ్లి బాత్‌రూం దగ్గర పడింది.

ఎవరు ఎలిమినేట్ అవుతారు..?

ఎవరు ఎలిమినేట్ అవుతారు..?

ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న హిమజ, పునర్నవి, మహేశ్‌లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. వీళ్లు ముగ్గురు టాస్కుల్లో వంద శాతం ప్రదర్శన చేశారు. దీంతో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయన్నది కూడా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X