Bigg Boss 7 Telugu: కంటెస్టెంట్లకు బిగ్ బాస్ మరో షాక్.. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యేలా టాస్క్

ఎప్పుడేం జరుగుతుందో తెలియని సంఘటనలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చిన ఈ షో ప్రతి ఏటా ఒక్క సీజన్ చొప్పున సాగిపోతోంది. ఇలా ఆరింటిని రికార్డు స్థాయిలో రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో మొదటి కెప్టెన్సీ టాస్కు ఎన్నో మలుపులతో సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఊహించని టాస్క్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును ఐదో వారంలో పరిచయం చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న పది మందిలో అమర్‌దీప్ - సందీప్, ప్రియాంక - శోభ, ప్రిన్స్ - తేజ, శివాజి - ప్రశాంత్, గౌతమ్ - శుభశ్రీ జంటలుగా మారారు. ఇక, వీళ్లకు పలు రౌండ్లలో టాస్కులు ఇస్తున్నారు. మొదటి దానిలో గౌతమ్ - శుభశ్రీ జంట గెలిచి మూడు స్టార్లను సొంతం చేసుకుంది.

Bigg Boss 7 Telugu

ఈ కెప్టెన్సీ టాస్కులో భాగంగా రెండో రౌండ్‌లో శివాజి - ప్రశాంత్ టీమ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే, మూడో రౌండ్‌లో ప్రిన్స్ యావర్ - టేస్టీ తేజ టీమ్ గెలిచింది. ఇలా బుధవారం రాత్రి ఎపిసోడ్ ముగిసే సమయానికి శివాజి టీమ్ ఐదు స్టార్లు, అమర్, గౌతమ్ టీమ్‌లకు నాలుగేసి స్టార్లు, యావర్ టీమ్‌ మూడు స్టార్లు, శోభా శెట్టి టీమ్ రెండు స్టార్లను సాధించాయి.

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్‌ను ఈరోజు ప్రారంభించబోతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో దీన్ని చూపించారు. ఇక, 'చిట్టీ ఆయేగా' అంటూ సాగే ఈ రౌండ్‌లో జంటలకు వాళ్ల ఫ్యామిలీలు లేదా ఇష్టమైన వాళ్ల నుంచి లెటర్స్ వస్తాయి. అయితే, ఇందులో ఒకరు లెటర్‌ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అలా చేసిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారు అవకుండానే ఎలిమినేట్ అవుతారని చెప్పారు.

 Housemates in 7th Season

తాజాగా వచ్చిన ప్రోమోలో సందీప్ మాస్టర్ - అమర్‌దీప్‌లకు వాళ్ల ఫ్యామిలీల నుంచి లెటర్లు వచ్చాయి. దీంతో అవి చూసి వాళ్లు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత అమర్‌ తన భార్య తేజూను చూసి చాలా రోజులు అయిందని బాధపడగా.. సందీప్ మాత్రం తన మదర్ హెల్త్ గురించి తెలుసుకోవాలని ఉందని అన్నాడు. దీంతో ఎవరు త్యాగం చేశారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Gives Letter Sacrificing

మరోవైపు, గౌతమ్‌ కృష్ణతో ఈ లెటర్ తనకు కావాలని శుభశ్రీ రాయగురు రిక్వెస్ట్ చేసింది. అలాగే, టేస్టీ తేజ సైతం తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు. ఇలా ప్రతి కంటెస్టెంట్ తన కుటుంబ సభ్యులను తలుచుకుంటూ ఓ రేంజ్‌లో ఎమోషనల్ అయిపోయారు. దీంతో ఈరోజు (గురువారం) ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X