బిగ్ బాస్2: గణేష్, నూతన్‌ని సాగనంపి.. హౌస్‌లో లవ్ యూ, హేట్ యూ!
Recommended Video

బిగ్ బాస్2 షో 16 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైంది. ఇప్పుడు హౌస్ ఓ 8 మంది మాత్రమే ఉన్నారు. షో చివరి అంకానికి చేరిపోయింది. మరికొన్ని వారాల్లోనే ఈ షోలో విజేత ఎవరో తేలిపోనుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 8 మంది సభ్యలు ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉన్నవారే కావడం విశేషం. గత వారం డబుల్ ఎలిమినేషన్ తో నాని షాక్ ఇచ్చాడు.

ప్రారంభం నుంచి
బిగ్ బాస్ 2లో ఎక్కువగా నామినేట్ అవుతూ వచ్చిన వ్యక్తి గణేష్. కానీ ఎలిమినేషన్ నుంచి అదృష్టం కొద్దీ గణేష్ తప్పించుకుంటూ వచ్చాడు. కానీ శనివారం రోజు గణేష్ హౌస్ వదలి వెళ్లక తప్పలేదు. గణేష్ ఎలిమినేట్ అయ్యాడంటూ నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.

నూతన్ నాయుడు
బిగ్ బాస్ 2 షోలో నూతన్ నాయుడు పాత్ర చెప్పుకోదగ్గ విధంగా సాగలేదనే చెప్పొచ్చు. నూతన్ నాయుడు ఎలిమినేట్ రి మరలా తిరిగి హౌస్ లోకి వచ్చారు. అయినా కూడా ఆయన హౌస్ సభ్యులందరిలో కలసిపోలేకపోయారు. దాని పర్యవసానమే ఆదివారం రోజు ఎలిమినేషన్.

డబుల్ షాక్
ఒకే వారం డబుల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్ లో తీవ్రత పెరిగింది. మునుముందు ఊహించని షాక్ లు ఉంటాయని నాని ప్రకటించారు. దీనితో విజేతగా ఎవరు నిలుస్తారో అనే ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతోంది.

కొత్త టాస్క్
కాగా నేటి ఎపిసోడ్ లో మరో కొత్త టాస్క్ ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. లవ్ యూ, హేట్ యూ అనే టాస్క్ ప్రారంభం కాబోతోంది. వినడానికి సింపుల్ గానే ఉన్నా ఇంటి సభ్యులలో ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఉండే బయట పెట్టడానికి ఈ టాస్క్ రూపొందించినట్లు తెలుస్తోంది.

తారాస్థాయికి
హౌస్ లో ప్రధాన పోటీదారులుగా భావిస్తున్న కౌశల్, తనీష్, గీత మాధురి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి మధ్య ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరడం లేదు.


Click it and Unblock the Notifications











