Bigg Boss Telugu 7: చరిత్ర సృష్టించిన ప్రశాంత్.. బిగ్ బాస్ హిస్టరీలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు

బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా దీన్ని మన వాళ్లు ఆదరిస్తున్నారు. దీంతో దేశంలోని చాలా భాషల్లో వస్తున్నా మన దగ్గర మాత్రమే భారీ స్పందనను అందుకుంటోంది. అందుకే ఈ షో తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఏడోది కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోన్న ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పల్లవి ప్రశాంత్‌కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏడో దానిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడని చెప్పాలి. ఆ తర్వాత కూడా అతడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

Bigg Boss Gives Second Chance to Pallavi Prashanth As Captain

ఏడో సీజన్‌లో ఐదో వారంలోనే బిగ్ బాస్ మొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో రౌండ్లు జరిగాయి. కానీ, చివరకు పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. తద్వారా ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు. ఫలితంగా తన సత్తాను నిరూపించుకున్నాడు. సింపతీ ప్రదర్శించి వచ్చాడంటూ తనపై వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టేశాడు.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కెప్టెన్ అయ్యాడని సంతోషిస్తున్న సమయంలోనే రెండు రోజుల క్రితం జరిగిన ఎపిసోడ్‌లో అతడికి బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్‌గా అతడు విఫలం అయ్యాడని చాలా మంది కంటెస్టెంట్లు చెప్పడంతో ప్రశాంత్ దగ్గర ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నాడు. కానీ, అతడికి ఇమ్యూనిటీ మాత్రం లభిస్తుందని చెప్పాడు. దీంతో ప్రశాంత్‌తో పాటు అతడిని అభిమానిస్తున్న వాళ్లంతా బాధపడ్డారు.

Bigg Boss Gives Second Chance to Pallavi Prashanth As Captain

పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ వెనక్కి తీసుకోవడంపై ఎన్నో రకాల విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా కంటెస్టెంట్లు చేసిన తప్పుకు అతడిని బలి చేశారని చాలా మంది దుయ్యబట్టారు. దీంతో గత ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్‌ను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచిన బిగ్ బాస్.. అతడి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తిరిగి ఇచ్చేశాడు. దీంతో రైతు బిడ్డ మరోసారి పుష్పలా మారిపోయాడు.

కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను వెనక్కి తీసుకోవడం ద్వారా హౌస్‌లోకి కంటెస్టెంట్లు అందరినీ హెచ్చరించినట్లు అయిందని కన్‌ఫెషన్ రూమ్‌లో ఉన్న సమయంలో పల్లవి ప్రశాంత్‌తో బిగ్ బాస్ చెప్పాడు. ఇకపై అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఒకే వారంలో రెండు సార్లు కెప్టెన్‌గా నిలిచిన ఏకైక కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X