Bigg Boss 7 Telugu: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇలా.. మైండ్ పోతుంది లోపల

తెలుగు బుల్లితెరపైకి చాలా అనుమానాల నడుమ వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులందరి దృష్టినీ ఆకర్షించి.. భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఏకైక షో బిగ్ బాస్. కొత్త కాన్సెప్టే అయినా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ, బోల్డు కంటెంట్‌ను ప్రసారం చేస్తూ ఈ షోను నిర్వహకులు మరింత సక్సెస్ చేశారు. దీంతో ఇది ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

బిగ్ బాస్ షో తెలుగులో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నిర్వహకులు వరుసగా సీజన్లను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో సీజన్‌ను ఎన్నో అంచనాల నడుమ ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిపిస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇస్తూ కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇలా రేటింగ్‌ను రాబడుతున్నారు.

Bigg Boss Gives Shouting Task for second Power Astra in The Show

బిగ్ బాస్ ఏడో సీజన్ రెండో వారంలో మరో పవర్ అస్త్ర కోసం 'మాయ అస్త్ర' టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో హైడ్రామాలు జరిగాయి. మొత్తంగా ఈ వారానికి గానూ జరిగే పవర్ అస్త్ర కోసం శివాజి, షకీలా పోటీదారులుగా నిలిచారు. దీంతో వీళ్లిద్దరిలోనే ఒకరు ఈ వారం సేఫ్ అవడంతో పాటు నాలుగు వారాలు ఇమ్యూనిటీ పొందుతారని అంతా అనుకున్నారు.

శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని విధంగా పవర్ అస్త్ర కోసం జరిగే టాస్కు కోసం బిగ్ బాస్ మరో పోటీదారుడిని కూడా ఎంపిక చేయాలని సందీప్‌కు సూచించి పెద్ద ట్విస్టునే ఇచ్చాడు. దీంతో అతడు అమర్‌దీప్ చౌదరిని ఎంపిక చేశాడు. దీంతో శివాజి 'ఇది ఫెయిర్ కాదు. ముందు ఇద్దరిని సెలెక్ట్ చేసి మళ్లీ ఇంకొకరిని తేవడం ఏంటి. గేట్లు తీయండి వెళ్లిపోతా' అంటూ పదే పదే కెమెరాల ముందు చెప్పాడు.

Bigg Boss Gives Shouting Task for second Power Astra in The Show

అదంతా అయిపోయిన తర్వాత శివాజి, షకీలా, అమర్‌దీప్‌కు బిగ్ బాస్ షో చరిత్రలోనే ఎప్పుడూ ఇవ్వని విధంగా 'షౌటింగ్' (గట్టిగా అరవడం) టాస్కును ఇచ్చాడు. పేర్లు పిలిచినప్పుడల్లా వీళ్లు ముగ్గురు వెళ్లి చెవి ఆకారంలో ఉన్న బొమ్మ దగ్గర 'బిగ్ బాస్' అని అరవాలని చెప్పాడు. దీంతో శివాజి, షకీలా, అమర్‌దీప్‌లు తమ శక్తి మేర గట్టిగా అరిచారు.

మొత్తానికి ఈ షౌటింగ్ టాస్క్ అంతా కొత్త కొత్తగా సాగింది. అయితే, ఇందులో విజేత ఎవరనేది మాత్రం శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేస్తాడని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ఎవరు గెలుస్తారో వాళ్లు ఈ వారం సేఫ్ అవడంతో పాటు రెండో ఇంటి సభ్యులుగా ఎంపికై.. మరో నాలుగు వారాలు ఇమ్యూనిటీని పొందుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X