Bigg Boss 7 Telugu: మోనితకు స్పైసీ టాస్క్.. బాధ భరించలేక ఏడుపు.. చివర్లో భలే ట్విస్ట్ ఇచ్చాడుగా!

కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమానైనా.. ఏ తరహా షోను అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరించినట్లుగా మరెవరూ అక్కన చేర్చుకోలేరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ షో. పాశ్చత్య సంస్కృతికి అద్దం పట్టే అంశాలతో నడిచే ఈ కార్యక్రమం తెలుగులోనే సూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇది ఆద్యంతం ఆసక్తికరంగానే సాగుతోంది.

ఏడో సీజన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తవగా సందీప్, శివాజి మాత్రం పవర్ అస్త్రాలను సాధించి కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే మూడో వారానికి సంబంధించి పవర్ అస్త్ర కోసం అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను బిగ్ బాస్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, వీళ్లను కొందరు కంటెస్టెంట్లు చాలెంజ్ చేసి కోలుకోలేని షాకిచ్చారు.

Bigg Boss Gives Spicy Chicken Eating Task To Shobha Shetty

మొదటి రౌండ్‌లో భాగంగా ప్రిన్స్ యావర్ అభ్యర్థిత్వాన్ని చాలెంజ్ చేసిన రతికా, దామిని, టేస్టీ తేజ అతడితో పోటీ పడ్డారు. బుధవారం ముగిసిన ఈ టాస్కులో ప్రిన్స్ విజయం సాధించి మూడో పవర్ అస్త్ర కోసం పోటీపడే కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఇక, రెండో రౌండ్‌లో భాగంగా శోభా శెట్టి తన చాలెంజర్లతో పోటీ పడనుంది. దీన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు.

Bigg Boss Gives Spicy Chicken Eating Task To Shobha Shetty

తాజాగా వచ్చిన ప్రోమోలో శోభా శెట్టికి బిగ్ బాస్ 'స్పైసీ చికెన్ ఈటింగ్ టాస్క్'ను ఇచ్చాడు. ఇందులో బాగా కారంగా ఉన్న చికెన్ ముక్కలను వీలైనన్ని ఎక్కువగా తినాలని ఆమెకు బిగ్ బాస్ సూచించాడు. ఇందులో భాగంగానే శోభా శెట్టి బాధను దిగమింగుకుంటూ చాలా పీస్‌లను తినేసింది. ఒక సందర్భంలో కారం భరించలేక టిష్యూ పేపర్లతో నాలుకపై తుడుచుకుని ఏడ్చేసింది.

మొత్తానికి శోభా శెట్టి తన టాస్కును ఎలాగోలా పూర్తి చేసినట్లు చూపించారు. అయితే, ఆమెను చాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు కూడా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం కొంత టైమ్‌ను ఫిక్స్ చేసి.. శోభా శెట్టి తిన్న చికెన్ పీస్‌ల కంటే ఒక్కటైనా ఎక్కువ తినాలని చెప్పాడు. దీంతో ఇందులో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X