Bigg Boss Telugu 8: అర్ధరాత్రి ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్.. బిగ్ బాస్ మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్

అసలు ఎవరూ ఊహించని పరిణామాలతో ఎంతో ఆసక్తికరంగా సాగుతూ తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. అలాగే ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న దాన్ని మరింత కొత్తగా వినోదాత్మకంగా రూపొందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజా వారంలో ఎన్నో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎపిసోడ్‌లో అర్ధరాత్రి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చేశాడు. అసలేమైందో మీరే చూడండి!

చెప్పినట్లే అన్‌లిమిటెడ్‌గా
గతంలో వచ్చిన సీజన్లు అన్నీ ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎనిమిదో సీజన్‌పై అందరిలో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు సైతం వాటికి ఏమాత్రం తీసిపోకుండా దీన్ని నడుపుతున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మలుపులతో కూడిన సంఘటనలు చూపించారు. ఇలా మొత్తంగా మంచి కంటెంట్ ఇస్తూ మజా పంచుతున్నారు.

Bigg Boss Gives Strong Warning to Abhay Naveen For Unfollows Show Rules

ఆరంభంలో ప్రయోగాలు

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగబోతుంది. దీంతో ఇప్పటి నుంచే నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే చీఫ్స్ కోసం టాస్కులు కూడా ఇస్తున్నారు. అలాగే, ఎన్నో రూల్స్ మార్చేశారు. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారు. దీంతో కంటెస్టెంట్లకు మరికొన్ని కష్టాలు మొదలు కాబోతున్నాయని చెప్పొచ్చు.

ప్రభావతి టాస్కులో రచ్చ
తాజాగా ప్రసారం అవుతోన్న సీజన్‌లో మూడో వారంలో 'ప్రభావతి 2.O' టాస్కును ఇచ్చారు. ఇందులో నిఖిల్ క్లాన్, అభయ్ క్లాన్‌లలో ఎవరి దగ్గర ఎక్కువగా గుడ్లు ఉంటే వాళ్లు గెలుస్తారు. దీంతో ఇరు జట్ల సభ్యులు ఎక్కువ గుడ్లను సాధించేందుకు తెగ ట్రై చేశారు. ఫలితంగా కంటెస్టెంట్ల మధ్య చాలా ఫైటింగ్స్ కనిపించాయి. దీంతో ఈ టాస్క్ అంతా రణరంగంగా మారిపోయింది.

అభయ్ నవీన్ సీరియస్

బిగ్ బాస్ షోలో కొత్తగా వస్తున్న రూల్స్‌పై అభయ్ నవీన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలోనే 'నీకు బ్రెయిన్ ఉన్నదారా? బొక్కలో డెసిషన్స్ నువ్వు. అసలు మీరు మనిషికే పుట్టావా? ముగ్గురు కలిసి ఇంత మందికి ఎలా వండుతారు? దిమాక్ ఉన్నదారా నీకు' అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో ఇది పెద్ద రాద్దాంతం అయింది. దీన్ని బిగ్ బాస్ ప్రోమో కూడా వేసేశాడు.

అర్ధరాత్రి హైడ్రామాతో
అభయ్ నవీన్ విషయంపై బిగ్ బాస్ స్ట్రాంగ్‌గానే స్పందించాడు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో అర్ధరాత్రి అందరినీ పిలిచి 'ఈ సీజన్‌లో క్లాన్స్ చాలా ముఖ్యం. ఇందులో గెలిచిన వాళ్లకు ప్రయోజనాలు, ఓడిన వాళ్లకు పనీష్‌మెంట్‌లు ఉంటాయి. అభయ్ మీరు ఓడినందునే చీఫ్‌గా తొలగించాం. అయినా ఇది బిగ్ బాస్ ఇల్లు. కాబట్టి ఆయన రూల్సే ఉంటాయి' అని చెప్పాడు.

ఎలిమినేట్ చేస్తానని

ఆ తర్వాత బిగ్ బాస్ 'బిగ్ బాస్ పెట్టే రూల్స్‌కు కట్టుబడి ఉంటేనే మీరు ఇక్కడ ఉండొచ్చు. మీలో ఎవరైనా బిగ్‌బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ మీకోసం తెరుచుకుంటున్నాయి. బిగ్‌బాస్ అంటే మర్యాద లేనివాళ్లు ఇప్పుడే వెళ్లిపోవచ్చు' అంటూ గేట్లు ఓపెన్ చేశాడు. తర్వాత అందరూ సారీ చెప్పారు. అప్పుడు నా రూల్స్ ఫాలో అయితేనే గేట్లు మూస్తా అంటూ ఝలక్ ఇచ్చాడు. మొత్తానికి ఈ సారి బిగ్ బాస్ కాస్త సీరియస్‌గానే రూల్స్ ఫాలో అయ్యేలా చేస్తున్నాడని అర్థం అయింది. ఇక, అర్ధరాత్రి ఎలిమినేషన్ డ్రామా బాగానే వర్కౌట్ కూడా అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X