For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Siri Hanumanth: సిరి హనుమంత్ కి బిగ్ బాస్ అవకాశం.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీహాన్ లవర్

  |

  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ రసవత్తరంగానే సాగుతోంది. ఇందులో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా వారిలో 9 మంది ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. అయితే ఈ సీజన్ అనే కాకుండా బిగ్ బాస్ హౌజ్ లో ప్రేమాయణాలు, రొమాన్సులు జరగడం సాధారణమే. లవ్ ట్రాక్ లు, కౌగిలింతలు, ముద్దులతో నెగెటివిటీని మూటగట్టుకున్న జంట సిరి హనుమంత్ అండ్ షణ్ముఖ్ జశ్వంత్. వీరిద్దరి ఫ్రెండ్స్ అయినప్పటికీ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సిరి లవర్ శ్రీహాన్ చోటు పార్టిస్ పేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్ కు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు.

  భారీ రెస్పాన్స్..

  భారీ రెస్పాన్స్..

  తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. కానీ, అందులో చాలా తక్కువ షోలు మాత్రమే ఈ రంగాన్నే శాసించే విధంగా సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ రావడంతో దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ప్రసారం చేస్తున్నారు.

   అదిరిపోయే కంటెంట్ తో..

  అదిరిపోయే కంటెంట్ తో..

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలన రేటింగ్‌తో దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చిత్ర విచిత్రంగా సాగుతోంది. దీనికి ఆరంభంలో పెద్దగా రేటింగ్ రాలేదు. కానీ, క్రమంగా ఇందులో అదిరిపోయే కంటెంట్ వస్తుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ పెరుగుతోంది.

  టాప్ 5లో శ్రీహాన్..

  టాప్ 5లో శ్రీహాన్..

  బిగ్ బాస్ ఐదో సీజన్ లో సిరి హనుమంత్, షణ్ముఖ్ జశ్వంత్ ఫ్రెండ్ షిప్ ఎలా పోట్రే అయిందో తెలిసిందే. ఫ్రెండ్స్ అని చెప్పి వారిద్దరూ చేసిన పనులు ప్రేక్షకులకు రుచించలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో సిరి హనుమంత్ లవర్ గా శ్రీహాన్ చోటు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన స్టైల్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీహాన్. టాప్ 5లో కచ్చితంగా ఉంటాడన్న టాక్ వినిపిస్తోంది.

   బిగ్ బాస్ సీజన్ 4 వర్సెస్ సీజన్ 5..

  బిగ్ బాస్ సీజన్ 4 వర్సెస్ సీజన్ 5..

  ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం విత్ స్టార్ పరివారం ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. సీజన్ 4 అండ్ సీజన్ 5కి మధ్య పోటీ పెట్టారు. సీజన్ 4 నుంచి సోహైల్, నోయెల్ సీన్, అరియానా గ్లోరి, దివి వాద్యా, అమ్మ రాజశేఖర్ రాగా.. సీజన్ 5 నుంచి టైటిల్ విన్నర్ వీజే సన్నీ, ఆర్జే కాజల్, మానస్, సిరి హనుమంత్, హమిదా హాజరయ్యారు. ఖైది సినిమాలో కార్తి గెటప్ లో బిర్యానీ తింటూ సోహేల్ ఎంట్రీ ఇవ్వగా.. రోలెక్స్ లా వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు.

   కన్నీళ్లు పెట్టుకున్న సిరి..

  కన్నీళ్లు పెట్టుకున్న సిరి..

  అనంతరం సిరి.. హౌజ్ లో ఉన్న మీ హార్ట్ (శ్రీహాన్)కు ఏం చెప్పాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ సడెన్ గా అడిగి సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఆర్జే కాజల్ ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది సిరి హనుమంత్. సీజన్ 5 నుంచి వారందరూ ఆమెను ఓదార్చారు. తర్వాత సోహేల్ మీ కథ ఎలా ఉందని అడిగిన బిగ్ బాస్ కు.. షో వల్ల నేను ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నాను. కానీ ఒక భయం అంటూ చెబుతుండగా కన్నీళ్లతో వీజే సన్నీని చూపించారు.

  క్షేమ సమాచారాలు..

  ఆదివారం విత్ స్టార్ పరివారం ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవ్వడాన్ని చూపించారు. వారందరి క్షేమసమాచారాలను బిగ్ బాస్ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వాళ్లు ఏం మాట్లాడారు, ఒక్కొక్కరి జర్నీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

  English summary
  Bigg Boss 4 Vs Bigg Boss 5 In Adivaram With Star Maa Parivaar Program And Bigg Boss Chance To Siri Hanumanth About Bigg Boss Telugu 6 Contestant Shrihan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X