Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాలెంటైన్స్ డేను అలా సెలెబ్రేట్ చేసుకుంది.. బిగ్ బాస్ హారిక మామూల్ది కాదుగా!
మామూలుగా అయితే వాలైంటైన్స్ డేను ప్రియుడు, ప్రియురాలితో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ బిగ్ బాస్ ఫేమ్ హారిక మాత్రం తన వాలెంటైన్స్ డేను ఇంటి సభ్యులతో వెరైటీగా సెలెబ్రేట్ చేసుకుంది. దానికి కూడా ఓ స్పెషల్ కారణం ఉండనే ఉంది. ఇన్‌స్టాగ్రాంలో హారిక ఫాలోవర్లు మైలు రాయిని చేరుకుంది. అలా తన అభిమాన గణం పెరిగినందుకు ఇలా వాలైంటెన్స్ డేను వెరైటీగా సెలెబ్రేట్ చేసుకుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్లు అలా..
నాల్గో సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చిన వారందరికి ముందుగా అంత ఫాలోయింగ్ క్రేజ్ లేదు. బిగ్ బాస్ షో కంటే ముందు కొందరి ఇంటి సభ్యుల ఇన్ స్టా ఫాలోవర్లు వేలు కూడా దాటకుండా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరికి లక్షల్లో ఫాలోవర్లు వచ్చేశారు.
ఆమెకు ఎక్కువ..
నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో అందరికంటే లాస్యకు ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారు. బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందే ఇన్ స్టాలో వన్ మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. అయితే మినహా మిగతా ఏ ఒక్కరికి కూడా ఈ ఫీట్ లేదు. మరీ దారుణం పది వేలు, 20 వేల లోపే ఫాలోవర్లు ఉండేవారు.
హారికకు అలా..
బిగ్ బాస్ షో కంటే ముందే హారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. దేత్తడి అంటూ యూట్యూబ్‌లో హారిక వీడియోలు బాగానే క్రేజ్ సంపాదించుకున్నాయి. అలా ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. బిగ్ బాస్ కంటే ముందే హారిక దాదాపు ఐదు లక్షల ఫాలోవర్లు ఉన్నట్టున్నారు.
మిలియన్ మార్క్..
ఇప్పుడు తాజాగా హారిక మిలియన్ మార్క్‌ను చేరుకుంది. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో వన్ మిలియన్ మార్కును కేవలం హారిక, లాస్యలు మాత్రమే చేరుకున్నారు. అభిజిత్, సోహెల్ వంటి వారు 8, 7 లక్షలు అంటూ ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోన్నారు.
వాలెంటైన్స్ డే..
అయితే వాలెంటైన్స్ డే స్పెషల్‌గా హారిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ మైల్ స్టోన్‌ను సెలెబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే అభిజిత్, సోహెల్‌లు కూడా ఈ మార్క్‌ను అందుకునేలా ఉన్నారు.