సునైనాకు దూరంగా ఉండు.. తనీష్ తల్లి వార్నింగ్.. బాబు గోగినేని శకుని పాత్ర.. గణేష్‌కు మండింది!
Recommended Video

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీల అసలు మనస్తత్వాలు బయటపడుతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతున్న కొద్ది కుట్రలు, కుత్రంతాలు బయటపడుతున్నాయి. 45 రోజు కూడా ఇంటి సభ్యులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఫోన్ కాల్ మాట్లాడటానికి టాక్ టైమ్ కోసం కొత్త కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన పూజా రామచంద్రన్‌తో టాస్క్ చేయించారు. ఈ రోజు గణేష్, నందిని, దీప్తి సునైనా ఫోన్ మాట్లాడలేకపోయారు. వివరాల్లోకి వెళితే..

కౌశల్‌పై బాబు గుర్రుగా
కౌశల్‌పై బాబు గోగినేని గుర్రుగా ఉన్నాడు. నామినేట్ చేసినందుకు చాలా కోపంతో ఉన్నట్టు కనిపించాడు. నాతో పెట్టుకొంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తారనే కౌశల్ మూఢ నమ్మకాన్ని పటాపంచలు చేస్తాను. కౌశల్‌ను ఎలాగైనా బయటకు పంపించాల్సిందేనని ఛాలెంజ్‌గా తీసుకొన్నాడు.

నన్ను ఎవరూ కొనలేరు
ఓ వీకెండ్‌లో కౌశల్ నాకు డ్రస్ ఇచ్చాడు. డ్రెస్ ఇచ్చినందుకు నేను అతడికి లొంగి ఉండాలని భావిస్తున్నాడు. డబ్బు, డ్రస్‌తో నన్ను కొనగలరా అని బాబు గోగినేని ఆవేశంతో ఊగిపోయాడు. ఎలాగైనా నేను కౌశల్‌ను ఇంటి నుంచి బయటకు పంపిస్తానని శపథం చేశాడు.

గోగినేని గోగినేని శకుని పాత్ర
కౌశల్‌ను బయటకు పంపించడానికి బాబు గోగినేని శకుని పాత్ర పోషించేందుకు సిద్దమయ్యాడు. ఇంటి సభ్యులను కూడగట్టేందుకు మంతనాలు జరుపుతున్నాడు. గణేష్, సామ్రాట్, ఇతరులతో కలిసి మనమంతా కౌశల్‌ను బయటకు పంపించడానికి కలిసిపోవాలి. ఇదంతా గేమ్‌లో భాగమని చెప్పాడు.

ఇంటి సభ్యుల కోసం పూజా టాస్క్
ఇంటి సభ్యుల ఫోన్ కాల్ కోసం పూజా రామచంద్రన్ టాస్క్ ఆడారు. పేడలోంచి కాయిన్స్ తీయడం, ఈత కొలనులో స్విమ్మింగ్ టాస్క్‌తోపాటు, సుమారు పది ఫిజ్ డ్రింక్స్ తాగింది. గణేష్, నందిని తప్ప మిగితా వారందరూ కుటుంబ సభ్యులతో మాటాడారు. గీతా, సామ్రాట్ సరిగా హింట్స్‌ను గుర్తు పట్టకపోవడంతో గణేష్, నందిని మాట్లాడలేకపోయారు.

బాబు దీప్తికి దూరంగా ఉండు
తనీష్‌తో వాళ్ల అమ్మ మాట్లాడటంతో అతను చాలా ఆనందంలో మునిగిపోయాడు. దీప్తి సునైనాతో ఎక్కువగా రొమాన్స్ చేయకు. నీ ఫ్యాన్స్ ఇష్టపడటం లేదు. ఆమెకు దూరంగా ఉండు. లేకపోతే ఓట్లు పడవు. నేను చెప్పింది జాగ్రత్తగా విను అని తనీష్ అమ్మ హెచ్చరించింది.

గీతామాధురిపై గణేష్ అసహనంగా
ఫోన్‌లో చిన్న క్లూ ఇచ్చిన గీతా మాధురి గుర్తు పట్టకపోవడంపై గణేష్ కొంత అసహనానికి గురయ్యాడు. ఒక్కొక్కరి నిజ స్వరూపం బయటపడుతుందని గోగినేనితో గణేష్ వ్యాఖ్యలు చేశారు. ఎలా గుర్తుపట్టావు అని గోగినేని అడుగగా గణేష్ చెప్పడానికి అయిష్టాన్ని ప్రదర్శించారు.
7

గణేష్, సునైనా, నందినికి మరో ఛాన్స్
ఫోన్ కాల్ మాట్లాడటం మిస్ అయిపోయిన గణేష్, దీప్తి సునైన, నందినికి మరో మారు ఛాన్స్ ఇస్తానని బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు. కానీ అందుకు కొన్ని షరతులు పెట్టాడు. అవేమిటంటే.. ఈ సీజన్‌కు కెప్టెన్సీ పదవికి పోటీ పడకూడదు. ఈ వచ్చేవారం సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి. అలాగే మొత్తం సీజన్‌కు కూడా నామినేషన్ చేసుకోవాలి అని మూడు పాయింట్లు సూచించాడు. దాంతో ముగ్గురి ముఖాలు పాలిపోయాయి.


Click it and Unblock the Notifications











