పెళ్లిళ్లు నాకు సెట్ కావు.. విడాకులపై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ హిమజ
బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొన్న హిమజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ లో ప్రవేశించే నాటికి కొన్ని సీరియల్స్ లో కొన్ని సినిమాల్లో కనిపించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె బిగ్ బాస్ సీజన్ త్రీ లో ప్రవేశించి చాలా రోజుల పాటు హౌస్ లో ఉండి బయటకు వచ్చింది. అయితే ఆమె తన భర్తకు విడాకులు ఇస్తోంది అంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పేరు మార్చడంతో ఈ ప్రచారం మొదలు కాగా ఎట్టకేలకు ఆమె తన విడాకుల వ్యవహారం మీద స్పందించింది. ఈ విషయం మీద ఆమె ఏమని స్పందించింది అనే వివరాల్లోకి

సర్వాంతర్యామి టెలీఫిల్మ్ లో
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన హిమజ నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. ఆమె ముందుగా సాయిబాబా జీవిత చరిత్ర మీద తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన సర్వాంతర్యామి అని ఒక టెలీఫిల్మ్ లో నటించింది. గురు పౌర్ణమి సందర్భంగా మా టీవీ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాలో నటనకు గాను హిమజ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆమె టీవీ యాంకర్ గా కొన్నాళ్లపాటు తెలుగు సినీ రంగ ప్రవేశం కోసం ప్రయత్నాలు చేసింది.

సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టి
రామ్ హీరోగా వచ్చిన శివం అనే సినిమాతో నటిగా పరిచయమైన ఆమె నేను శైలజ సినిమాలో పాత్రకు మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కాలంలో ఆమె జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, జంబలకడిపంబ, వినయ విధేయ రామ, చిత్రలహరి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి, వరుడు కావలెను, కనబడుట లేదు లాంటి సినిమాల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో నటిగా నిలదొక్కుకుంది. సినిమాల్లో ప్రవేశించే నాటికి ఆమె సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది.

బిగ్ బాస్ తర్వాత
2013 లో ప్రారంభమైన భార్యామణి అనే సీరియల్ లో ఆమె అపూర్వ అనే క్యారెక్టర్ లో నటించింది ఆ తర్వాత కూడా అనేక సీరియల్స్ లో కొన్ని రియాలిటీ షోలలో కంటెస్టెంట్ గా కూడా ఆమె కనిపించింది. అయితే రెండు వేల పంతొమ్మిది లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ త్రీ లో మాత్రం ఆమె కంటెస్టెంట్ గా ఎంటర్ అవ్వడమే కాక తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. సినీ రంగంలో అప్పటిదాకా ఉన్న గుర్తింపు ఒక లెక్క అయితే బిగ్ బాస్ తర్వాత హిమజ గుర్తింపు మరో లెక్క అన్నట్టు సాగింది. అయితే కొద్ది రోజుల క్రితం వరకు హిమజ ఇంస్టాగ్రామ్ పేరులో ఆమె పూర్తి పేరు హిమజారెడ్డి అని ఉండేది. ఎందుకు తీసిందో ఏమో తెలియదు కానీ ఆమె రెడ్డి అనే పదం తీసేసి హిమజ అనే పేరు ఇంస్టాగ్రామ్ కి ఫిక్స్ చేసింది.
బుద్ధి ఉండాలి కదా
దీంతో ఆమె తన భర్త విజయ్ అనే వ్యక్తి తో విడాకులు తీసుకోబోతోంది అని అందుకే అతని పేరు అయిన రెడ్డిని తన పేరు నుంచి తొలగించి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే సాధారణంగా ఈ మధ్య ఎప్పుడూ ఇలాంటి విషయాల మీద స్పందించలేదు కానీ ఇప్పుడు అనూహ్యంగా నాలుగు నిమిషాల పాటు ఉన్న ఒక వీడియోను తన సోషల్ మీడియా వేదికగా మీ షేర్ చేసింది. సాధారణంగా తాను ఇలాంటి విషయాల మీద స్పందించను కానీ, తన కుటుంబ సభ్యులు తన అభిమానులు బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చింది. దయచేసి నా పెళ్ళికి నా విడాకులకు నన్ను పిలవండి నాకే తెలియకుండా నా పెళ్ళి నా విడాకులు చేసేస్తున్నారు. ఇలా లైవ్ లో విడాకులు చేస్తే మీకు ఏం వస్తుంది అని ఆమె ప్రశ్నించింది. ఇలాంటివి ప్రసారం చేసే ముందు ఛానల్స్ కు కూడా బుద్ధి ఉండాలి కదా అని ఆమె ప్రశ్నించింది.
Recommended Video

పెళ్లిళ్లు లాంటివి సెట్ కావు
తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా చేసుకున్నప్పుడు మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసి అందరిని పిలిచి మరీ చేసుకుంటాను అని ఆమె చెప్పుకొచ్చింది. మంచి సంబంధాలు ఉంటే చూసి పెట్టండి అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే అవకాశం లేదు అని పేర్కొన్న ఆమె మరో 4, 5 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి తాను చాలా హ్యాపీగా ఉన్నాను అని సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. తనకు ఎక్కడికైనా వెళ్లాలంటే ఫ్రీ బర్డ్ లాగా వెళ్ళిపోతున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ పెళ్లిళ్లు లాంటివి తనకు సెట్ కావు అని పేర్కొన్న హిమాజా నాకు వచ్చిన పని చేసుకుంటూ నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. చాలా మంది ఈ ఫేక్ న్యూస్ గురించి రియాక్ట్ అవమని కోరడంతో తాను రియాక్ట్ అవుతున్నాను అని ఈ విషయం మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు. దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించ వద్దు అని ఆమె పేర్కొన్నారు. మొత్తం మీద అసలు వివాహమే కాలేదు అని కాబట్టి విడాకుల ప్రస్తావన అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చినట్లయింది.


Click it and Unblock the Notifications











