Bigg Boss: షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఒకేసారి ఇంటి నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఔట్!

బుల్లితెరపై ఎక్కువగా ఫేమస్ అయిన షో అంటే.. బిగ్ బాస్. ఇది హాలీవుడ్ నుంచి ఇండియాకు వచ్చింది. ఇండియాలో బిగ్ బాస్ హిందీ సీజన్ 17 నడుస్తుంది. దీనికి సల్మాన్ ఖాన్ హోస్టుగా ఉన్నారు. ఇక ఈ షోకోసం సల్మాన్ గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఈ షోలో.. కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ బిగ్ షాక్ ఇచ్చాడు. అయితే ఈ వారం నుంచి 5 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నారట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రేక్షకుల్లో అత్యధిక ఆదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట హాలీవుడ్ లో మొదలు అయింది. అక్కడ ఈ షోకు మంచి ఆదరణ రావడంతో.. మన ఇండియాలోనూ మొదలు అయింది.అలా మొదట హిందీలో ప్రారంభం అయిన ఈ షో... తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలకు చేరింది. ఒక్కో భాషల్లో ఒక్కో హీరో హోస్టుగా నిర్వహిస్తున్నాడు. ఇక సక్సెస్ ఫుల్ గా ఈ షో సాగుతోంది.

Bigg Boss Hindi 17: Five Contestants Eliminate in This Week

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నడుస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున హౌస్టుగా చేస్తున్నాడు. ఇక తమిళ బిగ్ బాస్ 7వ సీజన్ నడుస్తోంది. అక్కడ లోక నాయకుడు కమల్ హాసన్ హోస్టుగా చేస్తున్నాడు. ఇక కన్నడ బిగ్ బాస్ 10వ సీజన్ నడుస్తుంది. అక్కడు కిచ్చ సుదీప్ హౌస్టుగా చేస్తున్నారు. ఇక మలయాళ బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. అక్కడ హోస్టుగా మోహన్ లాల్ చేస్తున్నరారు.

ఇక హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. హౌస్టుగా సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. అక్కడ 17వ సీజన్ నడుస్తుంది. 17 సీజన్స్ అంటే మామూలు విషయం కాదు.. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్‌ కు అక్కడి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయిపోయాడు. ఈ వారంలో ఏకంగా ఐదుగురు కంటెస్టెంట్స్‌ ను ఎలిమినేట్ చేయనున్నట్లు సమచారం.

ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా.. ఐదు మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. అయితే గత రెండు వారాలుగా ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్ బాస్.. ఈ సారి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓకే సారి ఐదు మంది కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నాడు. అంతే కాదు.. మరో ఐదుగురి కొత్త వారిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంటిలోకి పంపించనున్నట్లు అర్థం అవుతుంది.

Bigg Boss Hindi 17: Five Contestants Eliminate in This Week

బిగ్ బాస్ హిందీ 17 సీజన్ కు సంబంధించిన కొత్త ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ గా హౌస్‌ లో అడుగుపెట్టిన వారిలో నీల్ భట్, నవిద్ సోలే, రింకు ధావన్, అభిషేక్ కుమార్, జిగ్నా వోరా ఎలిమినేట్ కానున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రోమో చూస్తే ఒకరిని ఒకరు వీడ్కోలు చెబుతూ ఎమోషల్ అయ్యారు. బిగ్ బాస్ షాకింగ్ డెసిషన్ తో ప్రేక్షకులు సైతం అవాక్కువుతున్నారు. ఇక చూడాలి మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X